Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4లో రూ.552 కోట్ల లాభాలు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 58శాతం వృద్ధితో రూ.552 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.350 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. క్రితం క్యూ4లో బ్యాంక్ మొండి బాకీల నుంచి నగదు రికవరీ పెరగడం, కేటాయింపుల భారం తగ్గడం, సగటు రుణాల్లో వృద్ధి అంశాలు మెరుగైన ఫలితాలకు దోహదంచేశాయని ఆ బ్యాంక్ తెలిపింది. గడిచిన 2021-22 లో మొత్తంగా బ్యాంక్ నికర లాభాలు రెట్టింపై రూ.1,709 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాదిలో రూ.831 కోట్ల లాభాలు ఆర్జిం చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ త్రైమాసికంలో ఏడాదికేడాదితో పోల్చితే 25శాతం చొప్పున వృద్ధిని సాధించాలని నిర్ధేశించుకున్నామని ఐఓబీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా పేర్కొన్నారు.