Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్థానిక స్టోర్ల డిజిటలైజేషన్‌కు మద్దతును అందించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ఇందుకోసం 'డిజిటల్ దూకాన్స్' పేరిట స్మార్ట్ కామర్స్ పరిష్కారాలను అందిస్తున్నట్టు బుధవారం సంబవ్ సమ్మిట్ వార్షిక కార్యక్రమంలో తెలిపింది. 2025 నాటికి కోటి మంది చిన్న వ్యాపారులకు డిజిటలైజేషన్ సేవలను చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ఇప్పటికే 1.5 లక్షల స్టోర్లకు మద్దతునిచ్చినట్టు తెలిపింది. ఈ స్టోర్లను వినియోగదారులు స్వయంగా సందర్శించి తమకు కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.