Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు భారతదేశంలో మరింత విస్తృతంగా రూరల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యల్ని చేపట్టినట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ ఉత్పత్తులు అందుబాటులో లేని అన్ని ప్రాంతాలకు సేవలను తీసుకు వెళ్లే ఉద్దేశంతో రూరల్ బ్యాంకింగ్ ఈ దిశలో బ్యాంకింగ్‌కు సంబంధించిన ప్రస్తుత చర్యలను క్రోడీకరించనుంది మరియు చివరి దశకు చేరువగా తోడ్కొని వెళ్లనుంది. రిటెయిల్ బ్రాంచ్ బ్యాంకింగ్‌ను బ్యాంకు అమలు చేస్తున్న ‘ఫ్యూచర్-రెడి’ పథకంలో భాగంగా రూపొందించగా, రూరల్ బ్యాంకింగ్ లావాదేవీలు చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే చాలా ప్రమాణం ఇప్పటికీ వినియోగించబడలేదు.
బ్యాంకులో 19 ఏళ్లకు పైబడి పని చేస్తున్న అనిల్ భావనానిని నేషనల్ రూరల్ బ్యాంకింగ్ హెడ్‌గా నియమించారు. బ్యాంకు ప్రస్తుతం తన 6,342 శాఖల్లో 50 శాతం చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కలిగి ఉంది మరియు మిగిలిన 50 శాతం శాఖలు మెట్రో మరియు నగర ప్రాంతాల్లో ఉన్నాయి. బ్యాంకు కామన్ సర్వీసు సెంటర్లు (CSC) విలేజ్ లెవల్ యాంత్రప్యూనర్స్ (VLE)లతో దూర ప్రాంతాల్లో బ్యాంకు శాఖల విస్తరణ కోసం పని చేస్తున్నాయి.
రూరల్ బ్యాంకింగ్ బిజినెస్‌లో అన్ని ఉత్పత్తులు అలాగే సేవల శ్రేణిని చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తుంది. ఈ దిశలో బ్యాంకు ఈ దిగువ పేర్కొన్న విధానాన్ని అలవర్చుకుంటుంది:
1. పంపిణీ నెట్వర్కు తన పంపిణీ నెట్వర్కును గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో 1,064 శాఖలను ప్రారంభించనుంది.
2. వ్యూహాత్మక భాగస్వామ్యం- ఆనంద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్తో బ్యాంకు భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, వినియోగదారుల పోకడ, వినియోగదారుల సంతృప్తి, సేవల డిజైన్, సేవలు అందించడానికి సంబంధించి వికసన చెందుతున్న డైనమిక్స్‌ను అర్థం చేసుకుని ‘రూరల్ ఫస్ట్’ పనితీరును సృష్టిస్తుంది.
3. నూతన ఉత్పత్తులు మరియు సేవలు- గ్రామీణ రవాణా ఆర్థిక వ్యవస్థ, అటవీ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ తదితరాలకు సంబంధించిన లావాదేవీలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సేవలను రూపొందించడం.
4. ఒన్-స్టాప్ షాప్ పరిష్కారం- చిన్న రైతులు, కార్మికులు మరియు వ్యాపారులకు ఒన్ స్టాప్ షాప్ సేవలు అందించేందుకు ప్రాధాన్యత
5. ఆర్థిక సాక్షరత జాగృతి- చక్కని పొదుపు అలవాట్లు మరియు ఆర్థిక సాక్షరత గురించి జాగృతిని విస్తరించడం
‘‘బ్యాంకు ద్వారా ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మరియు సేవలను భారతదేశంలోని అత్యంత కుగ్రామాలన్నింటికీ తోడ్కొని వెళ్లేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సీనియరు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు మరియు నేషనల్ రూరల్ బ్యాంకింగ్ హెడ్ అనిల్ భావనాని తెలిపారు. ‘‘ఇది సవాలు మరియు అవకాశంగా భావిస్తున్నాము మరియు దీన్ని ముందుకు తోడొకని వెళ్లేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను. పలు సంవత్సరాల నుంచి బ్యాంకు తన 50% మేర శాఖలను చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కలిగి ఉంది. ఈ ఉన్నతీకరించిన ప్రాధాన్యతతో మేము ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాఖలను ప్రారంభించనున్నాము. శాఖలు టచ్పాయింట్లుగా మేము గ్రామీణ అవసరాలను సమగ్రంగా అందిస్తుండగా, ఈ మార్కెట్లకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉత్పత్తులను సృష్టించేందుకు శ్రమిస్తున్నాము’’ అని వివరించారు.