Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న కాంట్రాక్టర్లు తక్కువ ఖర్చుతో కూడిన యాంత్రీకరణ ద్వారా ఉప–అనుకూలమైన గ్రేడింగ్ పద్ధతుల నుండి విముక్తి పొందడంలో సహాయపడటానికి మరియు దేశ నిర్మాణంలో పాల్గొనడానికి ఈ నూతన మెషీన్ తోడ్పడుతుంది.
· రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్‌లో 74హెచ్‌పీ సీఆర్డీఐ ఇంజిన్ ఉంది. దీనిలో 3మీటర్లు (10 అడుగుల) విస్తృత శ్రేణి బ్లేడ్ మరియు ఐమ్యాక్స్ టెలిమ్యాటిక్స్ పరిష్కారం ఉంది.
· ఈ యంత్రసామాగ్రిని ట్రాక్టర్ గ్రేడర్కు కాస్త ఎక్కువ ధరతో కూడిన పరికరాలతో ఉన్నతమైన గ్రేడింగ్‌ను అందించడానికి రూపొందించబడ్డాయి. అయినప్పటికీ, సంప్రదాయ మోటర్ గ్రేడర్స్తో పోలిస్తే ఇది చిన్న రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రాఫిట్ కా పార్టనర్‌గా నిలువనుంది.
· నిత్యం వృద్ధి చెందుతున్న మరియు విస్తృత శ్రేణి సేవలు మరియు విడిభాగాల నెట్వర్క్ మద్దతునందిస్తోంది. దీనిలో 50కు పైగా 3 ఎస్డీలర్షిప్లు, ఆథీకృత సేవా కేంద్రాలు, రిటైల్ ఔట్లెట్లతో కూడిన స్పేర్స్ నెట్వర్క్ ఉంది.
· రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్‌తో పాటుగా ఎక్స్‌కాన్ వద్ద ఎంసీఈ తమ మహీంద్రా ఎర్త్ మాస్టర్ వీఎక్స్ మరియు మహీంద్రా ఎర్త్‌మాస్టర్ ఎస్ఎక్స్ స్మార్ట్ బ్యాక్ హో లోడర్లను సైతం ప్రదర్శించింది. అత్యంత ప్రాచుర్యం పొందిన రోడ్ మాస్టర్ జీ9075 మరియు రోడ్‌మాస్టర్ జీ9595 మోటర్ గ్రేడర్స్ సైతం ఇక్కడ ప్రదర్శించారు. ఇవి 20% కు పైగా మార్కెట్వాటాను ఆక్రమించాయి.
· మహీంద్రా స్టాల్ వద్ద బ్లాజో ఎక్స్ 35 టిప్పర్, బ్లాజో ఎక్స్ 28 ట్రాన్సిట్ మిక్సర్ , పూర్తి సరికొత్త ఎల్సీవీ టిప్పర్, ఫ్యూరియో 7 మరియు ఫ్యూరియో 7 ఫ్యూయల్ బ్రౌజర్ అప్లికేషన్లను సైతం ప్రదర్శించారు.
హైదరాబాద్ : మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా యొక్క కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ డివిజన్ (ఎంసీఈ) నేడు తమ రోడ్డు నిర్మాణ యంత్రసామాగ్రి శ్రేణిని తమ పూర్తి సరికొత్త మహీంద్రా రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్ – ప్రాఫిట్ కా పార్టనర్ ఆవిష్కరణతో విస్తరించింది.
ఈ సందర్భంగా జలజ్ గుప్తా, బిజినెస్ హెడ్, కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ యూనిట్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘మహీంద్రా వద్ద మేము మా వినియోగదారులకు వైవిధ్యమైన ఉత్పత్తులు, సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. నేడు మరో ఉత్పత్తి ఆవిష్కరణను అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రోడ్డు నిర్మాణ యంత్ర సామాగ్రి విభాగంలో మహీంద్రా రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్ మోటర్ గ్రేడర్ ఆవిష్కరణతో చేశాము. దీనిని భారతదేశంలో చిరు రోడ్డు కాంట్రాక్టర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడంతో పాటుగా అభివృద్ధి చేశాము. మా ప్రధాన లక్ష్యమేమిటంటే, సబ్ –ఆప్టిమల్ గ్రేడింగ్ పద్ధతుల నుంచి చిన్న కాంట్రాక్టర్లు విముక్తి పొందడంలో సహాయపడటంతో పాటుగా యాంత్రికీరణను ఆధునీకరించడం మరియు దేశ నిర్మాణంలో వారు పాలుపంచుకునేలా చేయడం. పూర్తి సరికొత్త జీ–75 స్మార్ట్ మోటర్ గ్రేడర్ అత్యున్నతంగా ఆధారపడతగిన మెషీన్‌గా ఉంటుంది. దీని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల ప్రాఫిట్ కా పార్టనర్‌గా నిలువనుంది. మా ప్రస్తుత రోడ్‌మాస్టర్ శ్రేణి మెటర్ గ్రేడర్స్ ఇప్పటికే 20% మార్కెట్ వాటాను ఆక్రమించాయి. ఇప్పుడు జీ75 స్మార్ట్ మరింతగా ఈ మార్కెట్లో మా స్ధానం బలోపేతం చేయడంతో పాటుగా భారతదేశంలో చిన్న రోడ్ల నిర్మాణ ప్రక్రియను సైతం సమూలంగా మార్చనుంది. భారతదేశంలో దాదాపు 60% రోడ్లు ఈ తరహాలోనే ఉంటాయి’’ అని అన్నారు.
ఈ రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్, రోడ్డు కాంట్రాక్టర్లకు తాత్కాలిక రాజీ పరిష్కారాలైనటువంటి ట్రాక్టర్ గ్రేడర్లను వినియోగించడం , మాన్యువల్ లేబర్ వినియోగించడం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. గ్రామీణ, పట్టణ, జిల్లా రహదారులు, భూ అభివృద్ధి, అంతర్గత హౌసింగ్, వాణిజ్య రోడ్ల కోసం గ్రేడింగ్ అప్లికేషన్లను విస్తరించడానికి ఇది అనువైన యంత్రం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైనటువంటి స్మార్ట్ సిటీ, పీఎంజీఎస్‌వై రోడ్లు వంటి వాటికి అవసరమైన గ్రేడింగ్‌తో సహా పలు ప్రాజెక్టులలో పాల్గొనడానికి చిన్న రహదారి కాంట్రాక్టర్లను ఇది అనుమతిస్తుంది. రోడ్ మాస్టర్ జీ75 స్మార్ట్ , చిన్న కాంట్రాక్టర్లకు అందుబాటు ధరలలో రాజీలేని యాంత్రీకీకరణను అందిస్తుంది. మరీ ముఖ్యంగా సంప్రదాయ గ్రేడర్లతో ఇప్పటి వరకూ సాధ్యం కాని చిన్న ప్రాజెక్ట్‌లలో నమోదిత మోటర్ గ్రేడర్‌ను అమలు చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది. అంతేకాదు, ఇది పని యొక్క నాణ్యత, మన్నికను సైతం మెరుగుపరిచి, ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేసేందుకు సైతం తోడ్పడుతుంది.
రోడ్‌మాస్టర్ జీ75 స్మార్ట్‌లో 74 హెచ్‌పీ మహీంద్రా సీఆర్డీఐ ఇంజిన్ ఉంది. దీనిలో మూడు మీటర్లు (10 అడుగుల) బ్లేడ్ మరియు ఐమ్యాక్స్ టెలిమాటిక్స్ పరిష్కారాలు ఉన్నాయి. ఈ యంత్ర సామాగ్రి అసలు రాజీలేని గ్రేడింగ్ ను అందిస్తుంది. ఈ యంత్ర సామాగ్రి ధర ట్రాక్టర్ గ్రేడర్‌తో పోలిస్తే స్వల్పంగా అధికంగా ఉంటుంది. కానీ సంప్రదాయ మోటర్ గ్రేడర్లతో పోలిస్తే నామమాత్రంగా ఉండి చిరు రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రాఫిట్ కా పార్టనర్‌గా నిలుస్తుంది.
ఇది ఒక సంవత్సరం వారెంటీతో వస్తుంది. తద్వారా మరమ్మత్తు ఖర్చుల పరంగా వినియోగదారుల ఆందోళనను పరిష్కరిస్తుంది. ఇది మహీంద్రా యొక్క ఇంజినీరింగ్ మరియు తయారీ సామర్ధ్యం తో పాటుగా అత్యంత కఠినమైన పరీక్షా విధానాల కారణంగా సాధ్యమవుతుంది. ఈ మెషీన్ డిజైన్‌లోని సరళత, వినియోగించిన అత్యుత్తమ విడిభాగాలు కూడా దీనికి తోడ్పడతాయి.