Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జి స్క్వేర్ హౌసింగ్, దక్షిణ భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత అనుభవం కలిగిన భూమి సేకర్త మరియు ప్లాట్ ప్రమోటర్, కర్ణాటకలో తమ మార్కెట్ల కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా కర్ణాటకలో అత్యుత్తమ సినీనటుడు, సినీ నిర్మాత డా. శివ రాజ్‌కుమార్‌తో భాగస్వామ్యాన్ని ఈ రోజు ప్రకటించింది. ఈ అనుబంధంలో భాగంగా, కర్ణాటకలో జి స్క్వేర్‌కి సంబంధించిన వివిధ ప్రాపర్టీలు అభివృద్ధుల గురించి నటుడు డా. శివ రాజ్‌కుమార్ ప్రచారం చేస్తారు.
ఈ వివరాలను ప్రకటించిన సందర్భంగా, శ్రీ ఈశ్వర్ ఎన్, సిఇఓ జి స్క్వేర్, మాట్లాడుతూ “తమ కస్టమర్లకు ఉత్తమమైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను అందించడాన్ని జి స్క్వేర్ విశ్వసిస్తుంది, జి స్క్వేర్ అందించే వాటిలో పారదర్శకత కీలకంగా ఉంటుంది. నటుడు డా. శివ రాజ్‌కుమార్‌లో సమగ్రతను, స్థాయిని ఆయన అంకితభావాన్ని సంస్థ గుర్తించింది, జి స్క్వేర్ అందించే వాటి సారాంశం కూడా అదే, సంస్థ నమ్మే అంశాలతో అవి పరిపూర్ణంగా సమ్మిళితమవుతాయి. ఈ అనుబంధం కలిసిపోతుందనీ, కర్ణాటకలో మా ఎదుగుదల ఆకాంక్షలను మరింత నెరవేరుస్తుందనీ మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. జి స్క్వేర్ ద్వారా త్వరలో రాబోతున్న ప్రాజెక్ట్ అయిన బళ్ళారిలోని జి స్క్వేర్ సిటీ - భారతదేశంలోనే మొదటి వాటర్ థీమ్ కలిగిన ప్లాట్ టౌన్షిప్ కోసం ఇటీవలే బెంగళూరులో డా. శివ రాజ్‌కుమార్‌తో చిత్రీకరణ జరిపాం” అని తెలిపారు.
“అతి కొద్ది కాలంలోనే దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకరిగా ఎదిగిన జి స్క్వేర్ లాంటి బ్రాండ్‌తో భాగస్వామిని అవుతున్నందుకు నేను ఉత్తేజం చెందుతున్నాను. ఈ రోజున, తన వినియోగదారులకు అత్యుత్తమమైన వాటిని అందించడం మీద నిరంతరం దృష్టి సారిస్తూ, అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ సంస్థగా జి స్క్వేర్ పరిగణనలో ఉంది. అటువంటి ఒక బ్రాండ్‌తో ఏర్పడుతున్న అనుబంధాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను, దాని అభివృద్ధి కథలో భాగం కావడానికి ఎదురుచూస్తున్నాను” అని నటుడు త డా. శివ రాజ్‌కుమార్ చెప్పారు.
దక్షిణ భారతదేశంలో చెన్నై, కోయంబత్తూరు, హోసూర్, తిరుచ్చి, బెంగళూరు, త్వరలోనే బళ్ళారి లాంటి భిన్నమైన నగరాల వ్యాప్తంగా ప్రాజెక్టులు విస్తరించడంతో దక్షిణ భారతదేశంలో అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా జి స్క్వేర్ రూపుదిద్దుకుంది.