Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యవ్ వాటర్ జనరేటర్స్
హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అభివృద్ధి పేరిట సాగిస్తోన్న విధ్వంసం కారణంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడం లేదంటే అవి కాలుష్య కాసారాలుగా మారుతుండటం జరుగుతుంది. భవిష్యత్లో నీటిని అత్యధిక ధర చెల్లించి కొనుక్కునే పరిస్ధితులు కనబడుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు కావాలనుకునే వారికి వాతావరణం నుంచి నీటిని ఉత్పత్తి చేసే యూనిట్లు (ఏడబ్ల్యుజీ)తగిన పరిష్కారాలను అందించగలవు.
మౌలిక వసతుల లేమి లేదా ఆర్థిక పరమైన అవరోధాల కారణంగా నీటి తరలింపు కష్టంగా ఉన్న చోట్ల తగిన పరిష్కారాలను ఏడబ్ల్యుజీ అందించగలదు. తామున్న చోటనే వాతావరణం నుంచి నీటిని ఉత్పత్తి చేసి అందించడం దీని ప్రత్యేకత.
అర్యవ్ ఇప్పుడు ఈ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్స్ (ఏడబ్ల్యుజీ)ను అభివృద్ధి చేయడంతో పాటుగా అంతర్జాతీయ స్ధాయిలో నీటి కొరతకు తగిన పరిష్కారం చూపుతుంది. ఈ ఏడబ్ల్యుజీలు అందుబాటు ధరలో, స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన నీటిని అందించనున్నాయి.
‘‘ప్రతి ఒక్కరికీ వినియోగించతగిన నీటిని అందించాలనే మా లక్ష్యంలో భాగంగా విభిన్నమైన అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షన్ (ఏఎంఈ) సాంకేతికతలను అన్వేషించడంతో పాటుగా వాటిలో ఖచ్చితత్త్వం తీసుకురావడానికి ఆసక్తి చూపాము. ప్రసుతం, తాము ఏడబ్ల్యుజీలను వ్యాపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సాంకేతికతల ఆధారంగా తీర్చిదిద్దాము. ఇప్పుడు ఆర్యవ్తో నీటి కొరత అధికంగా ఉన్న దక్షిణ భారతదేశంలో లక్షలాది గృహా లలో నీటి కొరత సమస్య తీర్చనున్నాము’’అని ఆర్యవ్ ఏడబ్ల్యుజీ ఫౌండర్లలో ఒకరైన సంజయ్ కుమార్ గార్గ్ అన్నారు.
సంజయ్ మరింతగా వెల్లడిస్తూ ‘‘ఈ కండెన్స్ చేసిన నీటిని ఫిల్టర్ చేయడంతో పాటుగా శుద్ధి చేయడం, మినరలైజ్ చేయడం ద్వారా తాగునీరు లేదా వంట చేసుకోవడానికి అనువుగా మారుస్తాము. కూలింగ్ కోసం వినియోగించిన నిర్మాణాలకు కాక్టి స్ఫూర్తి. ఈ ఏడబ్ల్యుజీలు ఎంతనీటిని ఉత్పత్తి చేస్తాయన్నది వాతావరణ ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ, కాయిల్ ద్వారా పంపబడిన గాలి పరిమాణం,కాయిల్ను చట్లబరిచే యూనిట్ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది’’ అని అన్నారు.