Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వే2న్యూస్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : ద్విచక్ర విద్యుత్ వాహనాల (ఇవి) ధరలు అధికంగా ఉన్నాయని చాలా మంది అనాసక్తి కనబర్చుతున్నారు. ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ నిర్వహించిన సర్వేలో ఈ వాహనాలు సురక్షితం కావని సగం మంది పైగా అభిప్రాయడ్డారు. టూ వీలర్ల అగ్ని ప్రమాదాలు దీర్ఘకాలంలో వాటి అమ్మకాలపై ప్రభావం చూపుతాయని 1.14 లక్షల మంది (75.9 శాతం) స్పష్టం చేశారు. ఇవి సురక్షితం కావని 57 శాతం మంది పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,50,886 మందిని ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. ఇవి ఖరీదైనవని, తక్కువ ధరలో లభిస్తే రైడ్‌కు సిద్ధమని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. భవిష్యత్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలదేనని మూడింట రెండొంతుల మంది వెల్లడించారు.