Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జపనీస్కు చెందిన షార్ప్ కంపెనీ చిన్న కార్యాలయాల కోసం ఏ3 మోనో మల్టీ ఫంక్షన్ ప్రింటర్ (ఎంఎఫ్పీ) ఎఆర్-7024ను ఆవిష్కరించింది. శుక్రవారం హైదరాబాద్లో దీనిని షార్ప్ బిజినెస్ సిస్ట్మ్స్ ఇండియా ఎండి షింజి మినటోగవా మార్కెట్లోకి విడుదల చేశారు. ఎంఎస్ఎంఇలలో పెరుగుతున్న డాక్యుమెంట్ డిమాండ్లను చేరడానికి నమ్మకమైన 3 ఇన్ 1 పరిష్కారాలను అందిస్తుందని షింజి తెలిపారు. దీని ప్రారంభ ధరను రూ.81,884గా నిర్ణయించామన్నారు. ఇది నిమిషానికి 22 పేజీల నుంచి 35 పేజీల వరకు ప్రింట్ తీయనుందన్నారు.