Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూస్టార్ వెల్లడి
హైదరాబాద్ : ప్రముఖ ఎయిర్ కండీషనింగ్, వాణిజ్య శీతలీకరణ సంస్థ బ్లూ స్టార్ నూతన శ్రేణీ డీప్ ఫ్రీజర్లను ఆవిష్కరించినట్టు వెల్లడించింది. అదే విధంగా మహారాష్ట్రలోని వాడాలోని తమ ప్లాంట్ డీప్ ప్రీజర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ త్యాగరాజన్ వెల్లడించారు. గురువారం వర్య్చూవల్ మీడియా సమావేశంలో త్యాగరాజన్ మాట్లాడుతూ వాడాలోని ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రాన్ని రూ.130 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఇక్కడ ఏడాదికి ఒక లక్ష స్టోరేజీ వాటర్ కూలర్లు, 2 లక్షల డీప్ ఫ్రీజర్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందన్నారు.