Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బేయర్ యొక్క కన్స్యూమర్ హెల్త్ విభాగం వారి డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను Canesten® పేరుతో వారి యాంటీ ఫంగల్ సొల్యూషన్లను భారతదేశానికి తీసుకురావడం ద్వారా దాని విస్తరణను ప్రకటించింది. పౌడర్ మరియు క్రీమ్ ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది, ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను అందిస్తూ, చర్మ వ్యాధులను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సులభంగా ఉపయోగించగల పరిష్కారం, Canesten® అనేది దురద నుండి ఉపశమనాన్ని అందించే మరియు సంక్రమణ వ్యాప్తిని నిలిపివేసే ఫుల్-సైకిల్ చర్మ సంక్రమణ నియంత్రణ సూత్రీకరణ.
బాయర్ ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లోట్రిమాజోల్ ఆధారంగా రూపుదిద్దుకున్న క్యానెస్టెన్ ఎంతో ఉపశమనా న్ని అందిస్తుంది, ఎందుకంటే, ఇది విస్తృత శ్రేణి ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయగలుగుతుంది. క్యానెస్టెన్ యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ అనేది సూపర్ ఫిషియల్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నిరోధం, థెరపీ, ఫాలో అప్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించబడుతుంది. ఇది సాధారణ టాల్కమ్ పౌడర్ తో పోలిస్తే వేడి, ఎర్రబారడం, కందిపోవడం, చర్మం దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి 5 రెట్ల రక్షణను అందిస్తుంది.
క్యానెస్టెన్ క్రీమ్ అనేది రింగ్ వామ్, జాక్ ఇచ్, స్కిన్ క్యాండిడియాసిస్, అథ్లెట్స్ ఫుట్, ఇరిత్రాస్మా, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ తో పాటుగా ఇతర ఫంగల్ స్కిన్ ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ అ నేది ఇన్ ఫ్లమేటరీ లెసియన్స్ తో కూడిన స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించబడుతుంది. క్యానెస్టెన్ వి6 టాబ్లెట్లు సంక్లిష్ల వుల్వోవజినల్ కాండిడోసిస్ థెరపీలో తమ ప్రభావశీలతను నిరూపించుకున్నాయి.
110 దేశాల్లో లభ్యమవుతూ, యాంటీ ఫంగల్ సొల్యూషన్స్ లో మార్కెట్ అగ్రగామిగా ఉన్న క్యానెస్టెన్ భారత దే శంలో ఆవిష్కరించబడడం జీవితంలోని అన్ని దశలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందించేందుకు దృష్టి పెట్టడంపై బాయర్ కు గల కట్టుబాటును తెలియజేస్తుంది. క్యానె స్టెన్ వంటి సొల్యూషన్స్ తో బాయర్ మహిళల్లో ఫంగల్ చర్మవ్యాధులను నయం చేయాలని భావిస్తోంది. నిజానికి ఫంగల్ చర్మవ్యాధులను మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వెలువరించే తొలి సంకేతాలను పట్టించుకోరు. ఆ బాధలను భరిస్తూ, వంటింటి చిట్కాలతో వాటిని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చెమట, చెమటకాయలు, చర్మం ఎర్రబడడం లాంటివాటికి భారతదేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ప రిష్కారం టాల్కమ్ పౌడర్. అది సరైన విధంగా నయం చేస్తుందా లేదా అనే దాన్ని పట్టించుకోకుండానే మహిళ లు దాన్ని వాడుతుంటారు. నిపుణలు చెప్పే పరిష్కారాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ విధ మైన ప్రవర్తనతో పోరాడాలని క్యానెస్టెన్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ రూపొందించనున్న కమ్యూనికేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఆవిష్కరణ గురించి బాయర్ కన్జ్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ మాట్లాడుతూ, ‘‘భారతీయు లందరికీ స్వీయ సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే మా ఆశయసాధనకు బాయర్ లో మేం నిరంత రం కృషి చేస్తుంటాం. మహిళలు, మరీ ముఖ్యంగా చురుకైన జీవితం గడుపుతున్నవారు భారతదేశపు వేడి పరిస్థి తుల్లో ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. సత్వరమే లక్షణాల గుర్తింపు, నిర్ధారణ, చికిత్స వంటి ఉపశమనం అందిస్తాయి, అవి మళ్లీ మళ్లీ రాకుండా చూస్తాయి, జీవన నాణ్యతను పెంచుతాయి. దీనికి గా ను మేం మా అత్యుత్తమ అంతర్జాతీయ పరిష్కారాన్ని భారతదేశానికి తీసుకువచ్చాం. ప్రపంచవ్యాప్తంగా దాన్ని కో ట్లాది మంది మహిళలు ఇప్పటికే విశ్వసించారు. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అసౌకర్యంగా భావించ డం, వాటి గురించి దాచిపెట్టాలనుకోవడం కన్నా కూడా క్యానెస్టెన్ తో నయం చేసుకోవడం, జీవితాలను పూర్తి స్థా యిలో ఆనందంతో గడిపేలా వారిని మేం ప్రోత్సాహించాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
‘‘భారతదేశంలో మా డెర్మటాలజీ పోర్ట్ ఫోలియోను పటిష్టం చేసుకోవడంపై మేం దృష్టి పెట్టాం. బాయర్ ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లొట్రిమాజోల్ ను నూతన శిఖరాలకు చేర్చేందుకు మరియు క్యానెస్టెన్ ను మహిళల చర్మ ఇన్ ఫెక్షన్లకు ఓ పరిష్కారంగా వ్యవస్థీకృతం చేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని అన్నారు.
క్యానెస్టెన్ డస్టింగ్ పౌడర్ 50 గ్రా. మరు 100 గ్రా. ఎస్కేయూ (స్టాక్ కీపింగ్ యూనిట్లు)లలో లభ్యమవుతుంది. క్యానెస్టెన్ క్రీమ్ 30 గ్రా.ట్యూబ్ గా లభ్యం. వీటిని దేశవ్యాప్తంగా ఓటీసీ గా కొనుక్కోవచ్చు. మరో 2 ఎస్కేయూలు క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ 15 గ్రా. ట్యూబ్ లో మరియు క్యానెస్టెన్ వి6 మాత్రలు డాక్టర్ సిఫారసుపై కొనుగోలు చేయవచ్చు.