Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్‌కు బహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్ల్రు అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) నుంచి 2100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతి భారీ అర్డర్ లభించింది. ఈ ఆర్డర్ విలువ రూ.3675 కోట్లుగా ఉందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలిపింది. ఎంఇఐఎల్ గ్రూపు కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఈ మేరకు బెస్ట్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్‌ను పొందింది. ఈ నెల 7వ తేదీన ఈవీ ట్రాన్స్ ఎల్1 బిడ్డర్‌గా నిలిచింది. దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అతి పెద్ద ఆర్డర్ కూడా కావడం విశేషం. ఈ బస్సులను వచ్చే 12 నెలలలోగా అందించాల్సి ఉందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు. కంపెనీ చరిత్రలోనే తాము అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం సంతోషంగా ఉందన్నారు.