Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకేతాలు ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్
న్యూఢిల్లీ : తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలు ఇచ్చారు. వచ్చే జూన్ ఎంపిసి భేటీలో ద్రవ్యోల్బణ కొత్త అంచనాలను విడుదల చేయనున్నామని ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. రెపోరేటులోనూ పెరుగుదల ఉండొచ్చన్నారు. అయితే ఎంతా అనేది తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. మే 4న జరిగిన ఆర్బీఐ ఎంపీసీ భేటీలో రేపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచింది.