Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4పై ఇక్రా అంచనా
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగు త్రైమాసికం (క్యూ4)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 శాతానికి పడిపోవచ్చని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అధిక కమోడిటీ ధరలు, గోదుమల దిగుబడి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2011-12 స్థిర ధరలతో పోల్చితే జిడిపి భారీగానే తగ్గొచ్చని అంచనా వేసింది. కాగా.. డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతం వృద్థి నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం 2021-22 సంబంధించిన జిడిపి వివరాలను మే 31న కేంద్ర గణంకాల శాఖ (ఎన్ఎస్ఓ) అధికారికంగా వెల్లడించనుంది. ఇంతక్రితం 8.9 శాతంగా ఉండొచ్చని తొలుత అంచనా వేసింది. మార్చి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గడిచిన క్యూ4లో ముఖ్యంగా ఒమిక్రాన్ సవాళ్లకు తోడు అధిక కమోడిటీ ధరలు వృద్థిని దెబ్బతీసే అవకాశం ఉందని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయర్ పేర్కొన్నారు.