Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : జే ఎస్ డబ్ల్యూ గ్రూప్ యొక్క ఈ-కామర్స్ వెంచర్ అయిన జే ఎస్ డబ్ల్యూ వన్ ప్లాట్ఫార్మ్స్ యొక్క సిఈఓగా గౌరవ్ సచ్దేవ్ నియమించబడ్డారు. ఈ ఈకామర్స్ వ్యాపారము ఎంఎస్ ఎంఈలు డిజిటల్ గా వ్యాపారాన్ని చేయుటలో పారదర్శకతను, సకాలంలో డెలివరీ, విశ్వాసాన్ని, పనిచేసే సౌకర్యాన్ని అందించడం లక్ష్యంగా కలిగి ఉంది. జే ఎస్ డబ్ల్యూ వెంచర్స్ వద్ద నిధుల కొరకు వెంచర్ మూలధన పెట్టుబడులను తీసుకొనివచ్చే తన పదవి నుండి గౌరవ్ మారారు. జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ యొక్క సిఈఓగా, ఆయన దేశములోని తయారీ మరియు నిర్మాణ రంగ ఎంఎస్ఎంఈల కొరకు స్టీల్, ఇతర ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేసే ఒక దృఢమైన పారదర్శకమైన వేదికను సృష్టించుటకు జేఎస్డబ్ల్యు యొక్క విశ్వసనీయత, స్థాయితో సహకరించబడే ఒక అతి చురుకైన సంస్థను సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తారు.
ఎంఎస్ఎంఈ రంగములో అభివృద్ధిని ప్రోత్సహించుటకు జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ అభివృద్ధి యొక్కకీలక ప్రాంతాలను గుర్తించింది. భారత ప్రభుత్వము యొక్క అంచనాల ప్రకారము, భారతదేశములోని మొత్తం ఎగుమతులలో 40% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది, జిడిపిలో తయారీ రంగము యొక్క అంశాదాయం 6.11% ఉంది. ఉక్కు, సిమెంటు, పెయింట్ రంగాలలో జేఎస్డబ్ల్యు యొక్క ఉనికి సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజి ప్లాట్ఫార్మ్ ద్వారా ముఖ్యమైన గృహ-నిర్మాణ వస్తువులను అందించుటలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తన టెక్ ప్లాట్ఫార్మ్ పై వాటిని మార్కెట్ చేయుటకు జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ఫార్మ్స్ ఇతర పోటీ-పడని తయారీ, నిర్మాణ వస్తువుల బ్రాండ్స్ తో కూడా సహకారం అందుకుంటుంది. సీఈఓ నియామకముపై మాట్లాడుతూ జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ ఇలా అన్నారు, “జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ మన అవగాహనకు అంతర్గత పరిధిని చేరుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈ లతో అనుసంధానిస్తుంది. ఒక కొత్త భారతావనికి డిజిటల్ వేదికను నిర్మించుటకు మేము గర్విస్తున్నాము.
ఈ డిజిటల్ స్పేస్ లో మా అతిపెద్ద పెట్టుబడికి నాయకత్వం వహించేందుకు గౌరవ్ కు సంతోషంగా స్వాగతం పలుకుతున్నాము. జేఎస్డబ్ల్యు వన్ ప్లాట్ ఫార్మ్స్ ఉక్కు, సిమెంట్, పెయింట్ వ్యాపారాలలో తయారీ, పంపిణీల కొరకు తయారీ, నిర్మాణ రంగాలకు వన్-స్టాప్-సొల్యూషన్ ఆధారిత సాంకేతికతను నిర్మించుటకు గరిష్ఠ ప్రయోజనాన్ని కలిగించే లక్ష్యముతో స్థాపించబడింది. గౌరవ్ మరియు అతని బృందము భారతదేశములో అతిపెద్ద, అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక వ్యాపారాన్ని సృష్టిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను.”
గౌరవ్ జేఎస్డబ్ల్యు వెంచర్స్ నిర్మించే అనుభవాన్ని తెలిపారు. 2015 లో జేఎస్డబ్ల్యు వెంచర్స్ ఏర్పాటు చేయక ముందు, గౌరవ్ సిటిబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరిక, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలలో పనిచేసిన అనుభవం ఉంది. జేఎస్డబ్ల్యు వన్ త్వరలోనే తన ఉద్యోగులందరికి ఒక ఈఎస్ఓపి పాలసీని ఏర్పాటు చేస్తుంది. జేఎస్డబ్ల్యు వన్ భారతదేశము కొరకు నిర్మించాలని ఆకాంక్షించే ఉత్సాహభరితులైన వ్యక్తులచే నిర్మించబడింది. జేఎస్డబ్ల్యు వన్ యొక్క ఈఎస్ఓపి కార్యక్రమము సంస్థలో ఒక ధృఢమైన యాజమాన్యము, పనితీరు సంస్కృతిని నిర్మించడములో సహాయపడుతుంది.
తన నియామకము సందర్భములో మాట్లాడుతూ గౌరవ్ సచ్దేవ్ ఇలా అన్నారు, “భారతదేశపు ఎంఎస్ఎంఈ పర్యావరణవ్యవస్థకు సహకరించే ఒక ఆవశ్యక ప్లాట్ఫార్మ్ అయ్యే ఒక డిజిటల్ ఫస్ట్ సంస్థను నిర్మించుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా ఈఎస్ఓపి ప్రణాళిక ఒక సంపద-సృష్టించే ప్రయత్నము అవుతుంది, ఇందులో ప్రతి జట్టు సభ్యుడు అధిక వృద్ధి పనితీరును ప్రోత్సహిస్తూ, నిర్వహించుటకు మేము ఏర్పాటు చేసిన వాటిలో గర్విస్తూ సమానమైన పద్ధతిలో తమ కృషికి ప్రయోజనాలను అందుకుంటారు. మా ఈ-కామర్స్ వ్యాపారానికి మేము ఆశించే అభివృద్ధి అవకాశాలను క్యాపిటలైజ్ చేయుటకు ఒక ధృఢమైన వ్యాపార బృందాన్ని సృష్టించాము. మా బృందము B2B, B2C ఇంటర్నెట్ సంస్థల ఆరోగ్యకరమైన సమ్మేళనము. భారతదేశములోని ఎంఎస్ఎంఈలకు పారదర్శక ధరలు, వస్తువుల అందుబాటును అందించే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ నిర్మిస్తాము అని మేము నమ్మకంగా ఉన్నాము.