Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే 20-31, 2022 మధ్యలో షెడ్యూల్ చేయబడిన ఈ ఉత్సవంలో సభ్యులు స్టేపుల్స్, డైరీ డ ఫ్రెష్, పర్సనల్, హోమ్ కేర్ తదితర విభాగాల్లో అద్భుతమైన డీల్స్ మరియు ఆఫర్లను పొందవచ్చు.
తన 28 స్టోర్లు, ఆన్లైన్ ఛానెళ్ల ద్వారా తన సభ్యులు చేసుకునే పొదుపును మెరుగుపరచడాన్ని మహా మునాఫా ఉత్సవ్ లక్ష్యంగా పెట్టుకుంది
హైదరాబాద్ : భారతదేశపు స్వదేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ బి2బి మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ తన సభ్యులు మరింత ఎక్కువగా నగదు ఆదా చేసుకునేందుకు మద్ధతు ఇచ్చే లక్ష్యంతో తన వేసవి క్యాంపెయిన్ మహా మునాఫా ఉత్సవ్ ను ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది. మే 20- మే 31, 2022 వరకు, మొత్తం 28 స్టోర్లు, తన ఆన్లైన్ ఛానెళ్లలో ఇది అందుబాటులో ఉండేలా షెడ్యూల్ చేశారు. ఈ క్యాంపెయిన్‌లో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సభ్యులకు వివిధ నాణ్యమైన ఉత్పత్తులు, వివిధ వర్గాలకు చెందిన ఉత్పత్తుల్లో పలు ప్రత్యేకమైన మరియు అద్భుతమైన డీల్‌లను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. క్యాంపెయిన్‌లో భాగంగా ఫ్లాష్ సేల్, ధమాకా డీల్స్, ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్, క్యాట్ లెవల్ బాస్కెట్ ఆఫర్- (Ecom), బ్రాండ్ బిల్ బస్టర్స్, వెల్కమ్ ఆఫర్ మరియు కేస్ ప్యాక్ ఆఫర్లను స్టేపుల్స్, పర్సనల్ కేర్, డైరీ & ఫ్రెష్, హోమ్ కేర్, ప్యాక్ చేసిన ఆహారాలు మరియు పానీయాలను ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ అందించనుంది.
చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు (MSME) మరియు కిరణా సభ్యులకు అంకితం చేయబడిన ఫ్లాగ్షిప్ సేల్ఈవెంట్- వ్యాపారి దివస్‌ను ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ తన వారం రోజుల క్యాంపెయిన్‌ను ఇటీవలే ముగించింది. ‘అన్ దేఖే అన్ సునే ఆఫర్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో, హైదరాబాద్ సభ్యుల్లో దాదాపు 45 శాతం మంది ఆన్లైన్ ఛానెల్ ద్వారా కొనుగోళ్లు చేయగా, మిగిలిన 55 శాతం మంది భౌతికంగా దుకాణాల్లోకి వెళ్లి కొనుగోళ్లు చేసుకున్నారు. పానీయాలు, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు డ డ్రై ఫ్రూట్స్ మరియు పర్సనల్ కేర్ తదితర విభాగాల్లో ఎక్కువ కొనుగోళ్లు జరిగాయని కంపెనీ గుర్తించింది.
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన మార్కెట్ అవగాహన సమగ్రతను అనుమతిస్తుంది. కిరణాలు మరియు చిన్న, మధ్యతరహా సంస్థలకు (MSME) అర్థవంతమైన వృద్ధి పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ తన విస్తృతమైన నెట్వర్క్ ద్వారా, ఎస్ఎంఇ (SME) బ్రాండ్లు విజిబిలిటీ మరియు పాన్-ఇండియా మార్కెట్‌ప్లేస్‌కు యాక్సెస్‌ను పొందుతాయి.
మహా మునాఫా ఉత్సవ్ గురించి మరింత తెలుసుకునేందుకు దయచేసి https://www.bestprice.in/bestprice/login?origin=PROD&type=PN ను సందర్శించండి