న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) బోర్డు త్వరలో వాటాదారులకు డివిడెండ్‌ను ప్రకటించనుందని సమాచారం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 30న బోర్డు మీటింగ్ జరగనుందని ఎల్‌ఐసీ రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఈ సందర్బంగా 2022 మార్చి 31తో ముగిసిన ఏడాదికి గాను ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. కాగా డివిడెండ్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. మంగళవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేర్ విలువ 0.84 శాతం లేదా రూ.6.90 పెరిగి రూ.823.75 వద్ద ముగిసింది.