Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమేజాన్ ఇండియా 'బ్యాక్ టు స్కూల్' ని ప్రకటించింది. వివిధ ఉత్పత్తుల విస్త్రత శ్రేణులు పై వివిధ డీల్స్ ని విద్యార్థులకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. కస్టమర్స్ చదువుకోవడానికి, రాయడానికి అవసరమైన సామగ్రి, స్టేషనరీ, ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, పీసీలు, హెడ్ సెట్స్, స్పీకర్స్, ప్రముఖ బ్రాండ్స్ యైన హెచ్ పీ, లెనోవో, అసూస్, హోనర్, గ్జియోమి, డెల్ నుండి ప్రింటర్స్ పై కస్టమర్స్ 40 % వరకు తగ్గింపు పొందవచ్చు. 'బ్యాక్ టు స్కూల్' 12 జూన్, 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
ల్యాప్ టాప్స్ విషయంలో తెలంగాణా భారతదేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలు కంటే ముందంజలో ఉందని Amazon.in తెలియచేసింది. కంపెనీ తమ పోర్ట్ ఫోలియో ఎంపికని విస్తరించింది. ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ యొక్క కొత్త ఉత్పత్తుల్ని 30 వేలు, 35 వేలు నుండి 45 వేలు, 70 వేలు మరియు ఇంకా ఎన్నో ధరల శ్రేణుల్లో చేర్చింది. రాష్ట్రంలో మెదక్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, కోదాడ్, ఫరూక్ నగర్ వంటి చిన్న పట్టణాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ వంటి ప్రముఖ పట్టణాలు ల్యాప్ టాప్ శ్రేణి కోసం అదనపు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హెచ్ పీ, లెనోవో అసూస్, హోనర్ లు ప్రముఖ బ్రాండ్స్ గా నిలిచాయి. అమేజాన్ ఇండియా Amazon.in పై ల్యాప్ టాప్స్ కోసం చేసిన అన్వేషణలో సానుకూలమైన రెండు అంకెల వృద్ధిని చూసింది.
"గత 2 సంవత్సరాలుగా, వర్క్ ఫ్రం హోమ్, లెర్న్ ఫ్రం హోం కారణంగా ల్యాప్ టాప్స్ ఉపయోగిస్తున్న కస్టమర్స్ సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు, విద్యా సంస్థలు తెరుచుకోవడంతో, ఈ ప్రాంతం నుంచి ల్యాప్ టాప్స్ కోసం డిమాండ్ పెరిగినట్లుగా మేము గమనించాము. తెలంగాణా లోని కస్టమర్స్ Amazon.in పై ల్యాప్ టాప్స్ కోసం షాపింగ్ చేస్తున్నారు మరియు నో-కాస్ట్ ఈఎంఐ మరియు ఇంకా ఎన్నో ఫైనాన్స్ పథకాల్ని ఉపయోగిస్తున్నారు. వివిధ ధరల శ్రేణుల్లో Amazon.in పై విస్త్రత శ్రేణి ల్యాప్ టాప్స్ నుండి వారు ఎంచుకుంటున్నారు మరియు వేగంగా ఇంటి వద్ద డెలివరీ పొందే ప్రయోజనం అందుకుంటున్నారు. ఆసక్తికరంగా, ప్రీమియం/మధ్యస్థ శ్రేణి ల్యాప్ టాప్స్ ని Amazon.in లో కస్టమర్స్ ఇష్టపడుతున్నారు. తమ ఇళ్ల నుండి సురక్షితంగా తమకు అవసరమైనది కనుగొనడంలో కస్టమర్లకు సహాయపడటానికి మేము కట్టుబడ్డాము మరియు పెరుగుతున్న కస్టమర్ డిమాండ్స్ ని పరిష్కరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము" అని అక్షయ్ అహూజా, డైరక్టర్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ , అమేజాన్ ఇండియా అన్నారు.