Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధృఢమైన దంతాల ప్రాముఖ్యత గురించి అవగాహన వ్యాప్తి చేయడానికి కోల్గేట్ తో షాహిద్ కపూర్ మరియు రానా దగ్గుబాటి బృందం
హైదరాబాద్ : నోటి సంరక్షణలో మార్కెట్ అగ్రగామి అయిన కోల్గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, ఇండియా అతిపెద్ద టూత్ పేస్ట్ బ్రాండ్ కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ కొత్త గుర్తింపును తన అత్యంత తాజా క్యాంపెయిన్ ‘దాంత్ స్ట్రాంగ్ తో మైన్ స్ట్రాంగ్’ (దంతాలు బలంగా ఉంటే నేనూ బలంగా ఉంటా) తో ప్రకటించింది.
ధృఢమైన దంతాలు మరియు పోషకాహారం మధ్య అనుసంధానత మరియు మెరుగైన జీర్ణక్రియలో సహాయపడేందుకు, తద్వారా శరీరం మంచి పోషకాహారాన్ని గ్రహించేందుకై అన్నిరకాల ఆహారపదార్థాలను నమలడంలో ధృఢమైన దంతాల యొక్క గణనీయమైన పాత్రపై బ్రాండు వెలుగురేఖను ఉంచింది.
అంతేకాక, దేశం అభిమాన తారలు షాహిద్ కపూర్ మరియు రానా దగ్గుబాటిలు కొత్త తరం తండ్రులుగా, తమ పిల్లల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కలిగియున్న వారి పాత్ర పోషిస్తున్నట్లుగా బ్రాండు చూపించడం ఇదే మొదటిసారి. అందులో వారు, దంతాల్లో క్యాల్షియంని భర్తీ చేయడానికి సహాయపడే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్‌పేస్ట్ వాడకం వల్ల రూపొందిన ధృఢమైన దంతాలే తమ కుమార్తెల శక్తి అనే రహస్యాన్ని సమర్థవంతంగా తెలియజేశారు.
కొత్త కోల్గేట్ స్ట్రాంగ్ టీత్, బలం మరియు ధృఢమైన దంతాలకు చిహ్నంగా ఒక చిన్న అమ్మాయితో ఈ కాలానికి తగ్గట్టుగా ఉండే ప్యాకేజింగ్ కలిగియుంది.
కొత్త క్యాంపెయిన్ సందర్భంగా మాట్లాడుతూ, కోల్గేట్-పామోలివ్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ చింతామణి మాట్లాడుతూ.. 'భారతీయులుగా, ఆహారం మ్రింగడానికి ముందు 36 సార్లు నమిలి ఆ తర్వాత మ్రింగమని మన తల్లిదండ్రులు మనకు చెబుతుండగా అలాగే నములుతూ పెరిగాము. మరియు నమలాల్సిన ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకున్నాము. అయినప్పటికీ, దంతం మన మొట్టమొదటి జీర్ణావయవము. ఆహారం నుండి ఉత్తమ పోషకాహారం పొందడానికి గాను దంతాలు ధృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం తరచుగా మరచిపోతుంటాముు.
దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్న కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా అత్యుత్తమ ఉత్పాదనా శ్రేణితో వినూత్నమైన ఉత్పత్తులను సృష్టించడానికి బ్రాండు కట్టుబడి ఉంటోంది. ఈ సరికొత్త సిడిసి స్ట్రాంగ్ టీత్ అనేది మీ చిరునవ్వును ఆరోగ్యవంతంగా మరియు ధృఢంగా ఉంచుకోవడానికి ఒక సులువైన మార్పిడి అవుతుంది. ఈ టూత్ పేస్టు ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోరులలో 100 గ్రాముల ప్యాక్ రు. 63 మరియు 200 గ్రాములు రు.110 కి మరియు 500 గ్రాముల ప్యాక్ రు.253 లకు లభిస్తుంది.