Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత మరియు సంభావ్య వినియోగదారులకు పూర్తి సరికొత్త ఫోక్స్‌వేగన్ వర్టుస్‌ను భారతదేశంలో ఆవిష్కరించక మునుపే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న 18 షోరూమ్‌లలో వీక్షించే వినూత్న అవకాశం లభించింది.
భారతదేశ వ్యాప్తంగా మే 14వ తేదీన వర్టుస్ ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న152 ఫోక్స్‌వేగన్ డీలర్‌షిప్‌ల వద్ద 08 జూన్ 2022 వరకూ ఈ ప్రివ్యూలు కొనసాగనున్నాయి.
భారతదేశపు మార్కెట్ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.. వర్టుస్‌ను 09 జూన్ 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. తద్వారా ఫోక్స్‌వేగన్ బ్రాండ్ విజయవంతంగా ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనుంది
· భారతదేశపు మార్కెట్ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది వర్టుస్‌ను 09 జూన్ 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. తద్వారా ఫోక్స్‌వేగన్ బ్రాండ్ విజయవంతంగా ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనుంది
· ఈ నూతన సెడాన్,ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో వస్తోన్న రెండవ ఉత్పత్తి. సుప్రసిద్ధ ఎం.క్యు.బీ ఏఓ ఇన్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. ఇది భావోద్వేగ డిజైన్ భాషను ప్రదర్శించడంతో పాటుగా ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్స్, భద్రత మరియు కనెక్టివిటీ ఫీచర్లు కలిగి ఉన్నాయి.
· డిజైన్ పరంగా పెద్దది : ఫోక్స్‌వేగన్ వర్టుస్, ప్రీమియం మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో అతిపెద్ద కారు. ఇది తప్పులెంచలేనట్టి రీతిలో విశాలవంతమైన ప్రాంగణం కలిగి ఉండి, వినియోగదారులకు 2651 ఎంఎం వీల్‌బేస్ 521 లీటర్ల క్యాబిన్ మరియు బూట్ స్పేస్‌తో సౌకర్యం కల్పిస్తుంది.
· కనెక్టివిటీ పరంగా పెద్దది : ఈ సెడాన్‌లో విస్తృతశ్రేణి సాంకేతికత, కనెక్టివిటీ మరియు వినోద ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఔత్సాహిక భారతీయ వినియోగదారులకు ఆకట్టుకోనున్నాయి.
· పనితీరు పరంగా పెద్దది : బ్రాండ్‌కు అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన, అవార్డులు గెలుచుకున్న టీ.ఎస్.ఐ సాంకేతికత శక్తిని కలిగి ఉంది. ఈ వర్ట్యుస్ డైనమిక్, మరియు పెర్ఫార్మెన్స్ లైన్లో లభ్యం కావడంతో పాటుగా రెండు ఇంజిన్లు మరియు మూడు ట్రాన్స్మిషన్ అవకాశాలనూ కలిగి ఉంది.
· సౌకర్యం పరంగా పెద్దది : వెంటిలెటెడ్ ముందు సీట్లుచ స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఏసీ , కూల్డ్ గ్లోవ్ బాక్స్ కలిగిన వర్టుస్, కారులోపలి ప్రతి ఒక్క ప్రయాణీకుని ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా మారుస్తుంది
· ఫోక్స్‌వేగన్‌కు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యతాంశం – నూతన ఫోక్స్‌వేగన్ వర్టుస్లో 40 కు పైగా యాక్టివ్ మరియు పాసివ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఆరుకు పైగా ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రివర్శ్ కెమెరా ఉన్నాయి.
· ఆరు ప్రకాశవంతమైన రంగులలో వర్టుస్ లభ్యం ః వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్, కర్కుమా ఎల్లో, క్యాండీ వైట్ మరియు రైసింగ్ బ్లూ
హైదరాబాద్ : పూర్తి సరికొత్త వర్ట్యుస్ అనుభవాలను వినియోగదారులు సొంతం చేసుకునేందుకు అనువుగా ఫోక్స్‌వేగన్ పాసెంజర్ కార్ ఇండియా ఇప్పుడు తమ చూడగానే ఆకట్టుకునే, ఉల్లాసకరమైన, జర్మన్ సాంకేతిక నైపుణ్యం కలిగిన నూతన గ్లోబల్ సెడాన్ ప్రత్యేక ప్రివ్యూను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని 18 షోరూమ్‌ల వ్యాప్తంగా ఏర్పాటుచేసింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద ఈ బ్రాండ్ విడుదల చేసిన రెండవ ఉత్పత్తి వర్టుస్. దీనిని భారతీయ మార్కెట్లో 09 జూన్ 2022 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈ బ్రాండ్‌ను ఇండియా 2.0 ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా మరో అడుగు దగ్గర చేయనుంది.
ఈ ప్రివ్యూల ద్వారా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లోని వినియోగదారులకు మార్కెట్లో విడుదల చేయక మునుపే వర్టుస్ అనుభవాలను ప్రత్యేకంగా పొందే అవకాశం కలుగుతుంది. కార్లైన్తో పాటుగా వినియోగదారులు వినూత్నమైన ఫోక్స్‌వేగన్ అనుభవాలను దీని యొక్క నూతన డిజైన్ భాష పరంగా పొందవచ్చు. ఇది మరింత ప్రకాశవంతంగా ఉండటంతో పాటుగా ఆధునికంగా, ఆహ్వానించదగ్గ రీతిలో ఉంటుంది. ఇది డిజిటల్‌గా అనుసంధానితమై, మానవీయతను కలిగి ఉంటుంది. దీనిలోని డిజిటల్ పరిష్కారాలు ప్రాప్యత మరియు సౌకర్యంను వృద్ధి చేస్తాయి.
ఫోక్స్‌వేగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్, శ్రీ అశీష్ గుప్తా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘‘వోక్స్ వ్యాగన్ ఇండియాకు అత్యంత కీలకమైన దక్షిణ భారతదేశపు మార్కెట్లో ఐటీ కేంద్రమైన హైదరాబాద్ నగరంలో పూర్తి సరికొత్త వర్టుస్ ప్రత్యేక ప్రివ్యూ నిర్వహిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా వినియోగదారుల చెంతకు నూతన వర్టుస్ ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రీమియం మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో మా సరికొత్త బ్రాండ్ ఆఫరింగ్‌ను మార్కెట్లో విడుదల చేయక మునుపే వారు దాని అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. ఈ వర్టుస్‌ను 09జూన్ 2022న విడుదల చేయనున్నాము. ఫోక్స్‌వేగన్ వర్టుస్ చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండటంతో పాటుగా శైలి, సౌకర్యం మరియు పరిపూర్ణ చక్కదనపు సమ్మేళనంతో ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలోని మా వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకోనుంది’’ అని అన్నారు.
ఈ నూతన వర్టుస్ శక్తివంతమైన, భావోద్వేగ వోక్స్వ్యాగన్ డిజైన్ భాషను కలిగి ఉంది. దీనిని బ్రాండ్ యొక్క అత్యంత కీలకమైన డీఎన్ఏపై నిర్మించాము. ఇది అత్యున్నత నిర్మాణ నాణ్యత, భద్రత, మరియు నడిపేందుకు అత్యంత అనువైన డ్రైవ్ అనుభవాలను అందిస్తుంది. ఈ నూతన సెడాన్‌ను ఎం.క్యు.బీ ఏఓ ఇన్ ప్లాట్‌ఫామ్‌పై 95% స్ధానికీకరణతో నిర్మించారు. ఈ ప్లాట్‌ఫామ్ యొక్క సౌకర్యం ఈ సెడాన్‌ను ఈ విభాగంలో అత్యంత పొడవైన కారుగా (4,561 మిల్లీమీటర్లు)గా 521 లీటర్ల క్యాబిన్ మరియు బూట్ స్పేస్‌తో మారుస్తూ డిజైన్ పరంగా పెద్దదిగా మలుస్తుంది.
చూడగానే ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్స్‌తో నూతన వర్టుస్ విస్తృత శ్రేణిలో సాంకేతిక, వినోదం మరియు కనెక్టివిటీ ఫీచర్లు అయినటువంటి 20.32 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్, యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ద్వారా వైర్లెస్ యాప్ కనెక్ట్‌తో 25.65 సెంటీమీటర్ల పెద్ద టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్ధ, కెస్సీ (కీ లెస్ ఎంట్రీ మరియు ఇంజిన్ స్టార్ట్), ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్ టచ్ క్లైమట్రానిక్ ఏసీ, లీనమయ్యే శబ్దాలు ప్రామాణికంగా 8 స్పీకర్లు, వైర్లెస్ మొబైల్ చార్జింగ్ ఫ్రంట్ వెంటిలేటోడ్ సీట్లు, మై ఫోక్స్‌వేగన్ కనెక్ట్ యాప్ మరియు మరెన్నో ఫీచర్లు ఔత్సాహిక భారతీయ వినియోగదారుడిని ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. ఫోక్స్‌వేగన్ వద్ద భద్రత అనేది అత్యంత ప్రాధాన్యతాంశం. ఈ నూతన సెడాన్ 40కు పైగా యాక్టివ్ మరియు పాసివ్ భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్శ్ కెమెరా, ఎలకా్ట్రనిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), మల్టీ కొలిజిన్ బ్రేక్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో సౌకర్యవంతంగా అనుసంధానితమైన ఎల్ఈడీ హెల్ల్యాంప్స్ , ఐసోఫిక్స్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
జర్మన్ ఇంజినీరింగ్ అద్భుతం ఈ కార్లైన్. యాక్టివ్ సిలెండర్ టెక్నాలజీ (ఏసీటీ)తో 1.5 లీటర్ టీఎస్ఐ ఈవీఓ ఇంజిన్‌ను మరియు 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఐడెల్ స్టార్ట్/స్టాప్ తో కూడి ఉండటంతో పాటుగా 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ లేదా 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ అవకాశాలతో వస్తుంది.
ఈ నూతన వర్టుస్ ప్రకాశవంతమైన మరియు ఉత్సాహపూరితమైన ఎక్స్టీరియర్ రంగుల అయినటువంటి వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్, కర్కుమా ఎల్లో, క్యాండీ వైట్ మరియు రైజింగ్ బ్లూ లో వస్తుంది.
వినియోగదారులు ఫోక్స్‌వ్యాగన్ వర్టుస్‌ను భారతదేశ వ్యాప్తంగా 152 సేల్స్ టచ్పాయింట్లు వ్యాప్తంగా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు మరియు ఆన్లైన్లో ఫోక్స్‌వేగన్ ఇండియా వెబ్సైట్ వద్ద కూడా బుక్ చేసుకోవచ్చు.