Authorization
Mon Jan 19, 2015 06:51 pm
BMW గ్రూపు భారతదేశంలో అత్యంత విస్తృత మరియు వైవిధ్యమయ ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోలో ముందంజలో ఉంది.
అసాధారణ స్పోర్టీ మరియు గరిష్ఠ సౌఖ్యంతో డైనమిక్.
5.7 సెకండ్లలో తక్షణం 0-100 km/hr యాక్సలరేషన్ 340 hp ఔట్‌పుట్.
భారతదేశపు అత్యంత పరిణామకారి, దీర్ఘ శ్రేణి 590 Kms ప్రయాణించే ఎలక్ట్రిక్ వెహికల్.
తక్కువ ఛార్జింగ్ టైమ్ తీసుకునే అత్యంత పల్చని హై-ఓల్టేజ్ లిథియం-అయాన్ బ్యాటరీ.
ప్రారంభిక ఆఫర్: కాంప్లిమెంటరీ BMW వాల్ బాక్స్‌ఛార్జర్ ఇన్‌స్టాలేషన్.
ఇండియన్ లగ్జరీ కార్ సెగ్మెంట్‌లో ఫాస్ట్ ఛార్జర్ల విస్తృత నెట్‌వర్కు.
#BMWi4 #Electrifying #BornElectric #UltimateElectricDrivingMachine
గురుగ్రామ్ : ఫస్ట్-ఎవర్ BMW i4 ఇండియాలో నేడు విడుదలైంది. ఈ విడుదలతో BMW గ్రూపు భారతదేశంలో విస్తృతమైన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను అందిస్తున్న మొదటి కారు ఉత్పత్తిదారునిగా మారింది.
BMW i4 మొదటి BMW’s అత్యంత పరిశుద్ధమైన ఎలక్ట్రిక్ మోడల్ కాగా, డ్రైవింగ్ డైనమిక్స్‌పై దృష్టి సారించింది. ఇది అల్టిమేట్ డ్రైవింగ్ మెషిన్‌గా NEXTGen జాయ్‌కు అంతఃకరణ BMW యాటిట్యూడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే BMW i4 క్రీడా ప్రతిభను చూపిస్తూ దీర్ఘ ప్రయాణానికి అనుకూలత, వైశాల్యం మరియు ప్రాక్టికల్ అప్పీల్‌ను సంయోజిస్తుంది.
ఈ BMW i4 ను ఆన్‌లైన్‌లో shop.bmw.in బుక్ చేయవచ్చు. డెలివరీలు జులై 2022 నుంచి ప్రారంభమవుతాయి.
దీని గురించి BMW గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘BMW i4 విడుదలతో దేశంలో మొదటి ఎలక్ట్రిక్ మిడ్-సైజ్ సెడాన్‌ను పరియచం చేసేందుకు నేను ఉత్సుకతతో ఉన్నాను. శియర్ డ్రైవింగ్ ప్లెజర్‌తో BMW i4 శ్రమరహితంగా సస్టెయినబిలిటీని గతంలో ఎన్నడూ అనుభవించనట్లుగా సంయోజించింది. దానికి BMW ఇడ్రైవ్ టెక్నాలజీ ప్రత్యేక సంయోజన, అత్యంత పల్చని మరియు హై-వోల్టేజ్ లిథియం-అయాన్ బ్యాటరీ, రియర్ వీల్ డ్రైవ్ మరియు అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ కైనమ్యాటిక్స్ కలిగిన BMW i4 అసాధారణ స్పోర్టీ భావన తీసుకు వస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత భారీ శ్రేణి ఎలక్ట్రిక్ వెహికల్‌గా ఉంది. ఈ వర్గంలో అగ్రగామి వాతావరణంతో సంపూర్ణమైన లగ్జరీ మరియు రిలాక్సబుల్ ఎయిర్ సస్పెన్షన్‌తో దూర ప్రయాణాలకు గరిష్ఠ సౌఖ్యాన్ని ఇస్తుంది. ఆకర్షణీయమైన డైనమిక్, కంఫర్లబుల్ మరియు శక్తియుతమైన సమాన కొలతలతో BMW i4 వాస్తవంగా ఎలక్ట్రిఫైయింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా నిత్యం, ప్రతి ప్రయాణంలో అన్ని నిరీక్షణలను అధిగమిస్తుంది. నేడు BMW గ్రూపు అత్యంత విస్తృత పోర్ట్‌ఫోలియో ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలోని వినియోగదారులకు అందిస్తుంది’’ అని వివరించారు.
ఫస్ట్-ఎవర్ BMW i4 ఈ దిగువ పేర్కొన్న విధంగా ప్రారంభిక ఎక్స్-షోరూం ధరల్లో విడుదలైంది-
BMW i4 ఇడ్రైవ్40 స్పోర్ట్ - INR 69,90,000
*కంప్లీట్లీ బిల్ట్-అప్-యూనిట్ (CBU)
*ఇన్‌వాయిసింగ్ సమయపు ధర అన్వయిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు ఇన్‌క్లూజివ్ GST (కాంపన్సేషన్ సెస్‌తో కలిపి) అన్వయించేలా ఉంటుంది అయితే దాని రోడ్ ట్యాక్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS), RTO స్టాచ్యుటరీ ట్యాక్సెస్/ఫీజులు, ఇతర లోకల్ ట్యాక్స్ సెస్ లెవీస్ మరియు ఇన్‌సూరెన్స్ కలిసి ఉండవు. ధర మరియు ఎంపికలు ముందుగా తెలియజేయకుండానే మారిపోయే అవకాశం ఉంది. మరింత సమాచారానికి దయచేసి స్థానిక BMW ఆథరైజ్డ్ డీలర్‌ను సంప్రదించండి.
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఆకర్షణీయమైన మెటాలిక్ పెయింట్‌వర్క్ మినరల్ వైట్, బ్లాక్ సఫైర్ మరియు స్కైస్క్రాపర్ గ్రే, పర్ఫోరేటెడ్ సెన్సాటెక్ అప్‌హోల్స్‌ట్రీలో అందుబాటులో ఉండగా కెన్‌బెర్రా బీజ్, కాగ్నాక్ కలర్ స్కీంలలో లభిస్తుంది.
ఆప్షనల్ M ఏరోడైనమిక్ కిట్ M ఏరోడైరమిక్స్ బంపర్స్, ఎక్స్‌క్లూజివ్ 18 లేదా 19-ఇంచు M లైట్ ఏరో డైనమిక్స్ అలాయ్ వీల్స్ మరియు హై-గ్లాస్ బ్లాక్ M ఎలిమెంట్స్ అలంకరణలు డైనమిక్ మరియు స్పోర్టీ క్యారెక్టర్‌ను ఉన్నతీకరిస్తుంది.
ఫస్ట్-ఎవర్ BMW i4 అపరిమిత కిలోమీటర్లకు స్టాండర్డ్ రెండేళ్ల వారెంటీతో అందబాటులోకి వస్తోంది. రిపేర్ ఇన్‌క్లూజివ్‌ను ఎటువంటి మైలేజ్ లిమిటేషన్ లేకుండా మూడో ఏడాది పనితీరు నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు వారెంటీ అనుకూలతలను విస్తరించుకోవచ్చు. బ్యాటరీలో ఎనిమేళ్ల వరకు లేదా 160,000 కిలోమీటర్ల వరకు మౌలికంగా ఉంటాయి.
ఫస్ట్-ఎవర్ BMW i4 కోసమే డిజైన్ చేసిన BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లోన్, ఇన్సూరెన్స్ మరియు వెహికల్ సర్వీసెస్‌కు కంప్లీట్ ప్యాకేజ్ అందిస్తోంది. ప్రయోజనాల్లో అనుకూలకరం మరియు కస్టమైజ్ చేయదగిన యాజమాన్యపు ప్లాన్‌లు అయిన BMW 360° ఉండగా, అది అష్యూర్డ్ బై బ్యాక్ వ్యాల్యూ 4 ఏళ్ల వరకు అందిస్తుంది. యాక్ససరీస్‌కు 100% ఫైనాన్సింగ్ కూడా అందుబాటులో ఉండగా, అదనంగా BMW వాల్‌బాక్స్ ఛార్జర్ కలిగి ఉంటుంది. ఇన్సూరెన్స్ అదనపు ఎంపికలైన జీరో డిప్రిసియేషన్, బ్యాటరీ కవర్ మరియు ఇన్‌వాయిస్‌కు రిటర్న్ అదనపు ఎంపికలతో గరిష్ఠంగా రక్షణ అందిస్తుంది. కాంప్లిమెంటరీ 5- ఇయర్ రోడ్- సైడ్ అసిస్టెన్స్ ప్రయాణంలో అవసరమైనప్పుడు పోర్టబుల్ రోడ్ సైడ్ ఛార్జింగ్‌ల వంటి సౌకర్యాలతో సంపూర్ణంగా మనఃశ్శాంతి అందిస్తుంది. వినియోగదారులు ట్రేడ్-ఇన్/అప్‌గ్రేడ్‌కు ఆకర్షణీయమైన ఆఫర్లనూ కొత్త BMW లో ఆనందించవచ్చు.
ఫస్ట్-ఎవర్ BMW i4 ఇడ్రైవ్40
BMW i4 దోషరహితంగా ట్రైల్‌బ్లేజింగ్‌తో డైనమిజం మరియు సస్టెయినబిలిటీని ప్యూర్ ఎలక్ట్రిక్ మోడల్‌లో అందిస్తుంది. ఇది మీ హృదయ స్పందనను పెంచే రూపాన్ని అందిస్తుంది. ఫస్ట్-ఎవర్ BMW i4 తన ఆవిష్కారాత్మక తన స్లీవ్ లక్షణాన్ని తన స్పోర్టీ ఎక్స్‌ట్రావర్ట్ తరహాలో ధరించింది.
కారుకు సంబంధించిన ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ అథ్లెటిక్ ఈస్థటిక్స్‌తో సంయోజించగా, స్పష్టమైన సర్ఫేస్ భాష మరియు ప్రగతిశీలతకు సంబంధించిన కచ్చితత్వాన్ని ఇస్తుంది. ఇది తన శ్రేణిలో అత్యంత ఏరోడైనమిక్ ఎలక్ట్రిక్ వెహికల్‌గా ఉంది. ముందు వైపు విస్తృతంగా మూసి ఉన్న ఉపరితలాలు మరియు నిఖరమైన లైన్లను కలిగి ఉంది. ఫ్రంట్ యాప్రన్‌లో గ్రే ఇన్‌లే మరియు లంబానికి పక్కగా ఓపెనింగ్స్ వాహనం పని నిర్వహణ, ఆధునిక లక్షణాలను ప్రత్యేకంగా చాటి చెబుతుంది. రేడియేటర్ గ్రిల్‌లో సంక్షిప్తమైన రీ ఇంటర్‌ప్రిటేషన్ మరియు నీలం రింగ్ BMW బ్యాడ్జ్ చుట్టూ ఉంటుంది. ఫ్లాట్‌గా ఉండే కంటూర్డ్ హెడ్‌లైట్స్ మరియు ఫ్రోజెన్ గ్రే యాక్సెంట్‌తో అది శ్రీమంతమైన డిటైల్స్, పల్చని మోడల్‌లో భావనాత్మక శక్తిని అందిస్తుంది. రోమాంఛనంగా అభ్యుదయంతో పక్క నుంచి రూపం లాంగ్ వీల్ బేస్ నుంచి రూపుదిద్దుకోగా, డోర్ల ఫ్రేం లెస్ విండోస్, పైకప్పుపై ఫ్లూయిడ్ లైన్స్ మరియు షార్ట్ ఓవర్ హ్యాంగ్‌ను కలిగి ఉన్నాయి. విస్తృతమైన మృదువైన ఉపరితలాలు కచ్చితమైన క్యారెక్టర్ లైన్స్‌తో అసలైన BMW శ్రేష్ఠతను విరజిమ్మే ఆధునిక ప్రభావాన్ని సృష్టిస్తుంది. వెనుక సూక్ష్మమైన వర్టికల్ రియర్ స్పాయ్లర్‌ను ప్రదర్శిస్తుంది మరియు రెసెస్డ్ ఉపరితలాలు క్రీడాతనాన్ని సదృఢం చేస్తుంది మరియు విస్తృత పరిణామాన్ని అందిస్తాయి. సంక్షిప్తమైన L -షేప్డ్ రియర్ LED లైట్స్ అవి పల్చని కంటూర్స్ మరియు సమానాంతర గీతలతో BMW i4 రహదారిని ఎలా హత్తుకుంటుందనే దాన్ని ప్రదర్శిస్తుంది. తేలికైన ఏరో డైనమిక్ వీల్ డ్రైవింగ్ శ్రేణి వృద్ధి చేసేందుకు ఆఫర్ ఇస్తుంది. ఆటోమేటిక్ సెల్ఫ్-లెవలింగ్ ఫంక్షన్‌తో వెనుక ఇరుసుపై ఎయిర్ సస్పెన్షన్ గరిష్ట సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది మరియు షార్ప్ మలుపులపై స్థిరత్వాన్ని పెంచుతుంది
ఓపెన్, విలాసవంతమైన అలాగే ఆకర్షణీయమైన ఇంటీరియర్ డ్రైవర్-ఫోకస్డ్ కాక్‌పిట్ మరియు పొడవైన స్థలంతో కూడిన పరిసరాలను అందిస్తుంది. అలాగే BMW కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉన్నత నాణ్యత, వాహనంలోకి కాక్‌పిట్‌కు ఆధునిక స్పర్శను అందిస్తుంది. ఉన్నత నాణ్యత కలిగిన వస్తువుల అన్యోన్యత, పలు మోడళ్ల, ఇంట్యూటివ్ ఆపరేటింగ్ కాన్సెప్ట్ స్పోర్ట్ సీట్స్‌తో మరియు స్పోర్ట్ స్టీరింగ్ వీల్, డ్రైవరు మరియు ముందు వైపు ప్రయాణికులకు ప్రత్యేక ప్రదేశాలు మరియు అకౌస్టింగ్ గ్లేజింగ్ స్పల్ప దూరం ప్రయాణించినట్లే, దూరప్రయాణాలకు ఆనందదాయకమైన పరిసరాలను సృష్టిస్తుంది. స్పోర్ట్ సీట్స్ తన ఉన్నత నాణ్యత అలంకారిక స్టిచింగ్‌తో ప్రత్యేకంగా సొగసైన రూపాన్ని ఇస్తుంది. ముగ్గురు ప్రయాణికులకు పొడవైన హెడ్ మరియు లెగ్ రూమ్‌ను బ్యాక్ సీట్‌లో పొందవచ్చు. ఆరు ఎంపికలు చేయదగిన డిజైన్లతో యాంబియెంట్ లైటింగ్ ప్రతి మనస్థితికీ అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ న్యానో ఫైబర్ ఫిల్టర్‌తో గాలి నాణ్యతను గరిష్ఠం చేస్తుంది.
పెద్ద టైల్‌గేట్ ఆటోమేటిక్ ఓపెనింగ్ ఫంక్షన్‌తో 470- లీటర్ లగేజ్ కంపార్ట్‌మెంట్ లోడింగ్ మరియు అన్‌లోడింగ్‌ను అనుకూలకరం చేస్తుంది. దీనితో పని చేసే రియర్ బెంచ్ సీటు 40/20/40 స్ల్పిట్ గరిష్ఠ స్టోరేజ్‌తో స్థలాన్ని అందిస్తుంది మరియు 1290 లీటర్స్ బూట్ కెపాసిటీ అనుకూలతను అందిస్తుంది.
రియర్ వీల్ డ్రైవ్, 50/50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మరియు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ శ్రేష్ఠత సమతుల్యత, ప్రతిస్పందనను అందిస్తుంది మరియు అసాధారణమైన ట్రాక్షన్ మరియు దిక్కుకు సంబంధించిన స్థిరత్వాన్ని అత్యంత డైనమిక్ డ్రైవింగ్ కుశలతతో అందిస్తుంది.
ఫిఫ్త్ జనరేషన్ BMW ఇడ్రైవ్ టెక్నాలజీలో హైలీ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ యూనిట్లు ఉండగా, అవి ఎలక్ట్రిక్ మోటార్, సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌ను ఒకే హౌసింగ్‌లో తీసుకు వచ్చారు. ఈ i4 ఇన్‌స్టెంట్లీ 0 నుంచి 100 కిలోమీటర్లు/గంటకు యాక్సలరేషన్‌ను 5.7 సెకండ్లలో 340 hp ఔట్‌పుట్‌తో అందిస్తుంది.
తన విడుదలతో అత్యంత పల్చని (110 mm) మరియు హై-వోల్టేజ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఇంటిగ్రేటెడ్ సామర్థ్యం 80.7 kWh కలిగి ఉండగా అది 590 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. భారతదేశంలో ఏ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా సుదీర్ఘమైన రేంజ్‌ను BMW i4 కలిగి ఉంది.
ఫస్ట్-ఎవర్ BMW i4 వేగం మరియు అడ్డంకులు లేని ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం:
205 kW DC ఛార్జర్ : 10%-80%, 31 min / 164 kms చేరుకునే రేంజ్ 10 min*
50 kW DC ఛార్జర్ : 10%-80%, 83 min / 100 kms చేరుకునే రేంజ్ 18 min
11 kW AC ఛార్జర్ : 0%-100% ను 8.25 hrs గంటల్లో చేరుకుంటుంది
*బెస్ట్-ఇన్-క్లాస్ ఛార్జింగ్ కెపాసిటీ
ప్రారంభిక ఆఫర్‌గా BMW i4 ఇప్పుడు BMW ఇన్‌స్టాలేషన్‌తో కలిపి ఉచిత వాల్‌బాక్స్ ఛార్జర్‌తో వస్తోంది. దీనితో 11kW వరకు సురక్షితం మరియు అనుకూలకరమైన ఛార్జింగ్‌ను చేసుకునేందుకు ఇంట్లోనే అలవర్చుకోవచ్చు.
BMW గ్రూపు ఇండియా లగ్జరీ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఛార్జింగ్ నెట్‌వర్కుల్లో ఒకదాన్ని నిర్మించే లక్ష్యాన్ని కలిగి ఉండగా, భారతదేశ వ్యాప్తంగా 34 నగరాల్లో BMW డీలర్ నెట్‌వర్కులో ఫాస్ట్ ఛార్జర్లను అలవర్చనుంది. భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన BMW డీలర్ నెట్‌వర్కు అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా మరియు సౌకర్యవంతమైన ఛార్జింగ్‌ను నామమాత్రపు రుసుం చెల్లించి, చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఆవిష్కరణలకు సంబంధించిన అడ్డంకులను అధిగమించడానికి BMW కనెక్టెడ్ డ్రైవ్ టెక్నాలజీస్ ఇందులో ఉంది. BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌లో ప్రీస్టాండిగ్ BMW కర్వ్‌డ్ డిస్‌ప్లే నేవిగేషన్‌తో కలిసి ఉండగా, ఇది మొత్తం మీద 12.3-ఇంచు ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను మరియు 14.9- ఇంచు కంట్రోల్ డిస్‌ప్లేను గాజు ఉపరితలం వెనుక, డ్రైవరు వైపు వంగినట్లు ఉంటుంది. నూతన తరానికి చెందిన i డ్రైవ్ డిస్‌ప్లే మరియు కంట్రోల్/ఆపరేషన్ సిస్టమ్ తన న్యూ BMW ఆపరేటింగ్ సిస్టమ్ 8తో డ్రైవరు మరియు వాహనం మధ్య కమ్యూనికేషన్‌ను విస్తరిస్తుంది. వాహనం లోపల ఉండేవారు తమ BMW వర్చువల్ అసిస్టెంట్‌తో కేవలం మాట్లాడడం ద్వారా పలు పనులు చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ హోల్డర్‌ను సెంటర్ కన్సోల్‌కు జోడించబడి ఉండగా, మొబైల్ ఫోన్లకు ఇండక్టివ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటుంది. వైర్‌లెస్ కార్‌ప్లే®/ఆండ్రాయిడ్® ఆటో అడ్డంకులు లేని కమ్యూనికేషన్‌ను కారులకు పలు పనుల అందుబాటుతో అందిస్తుంది. హర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ 17 స్పీకర్లతో చెవులకు ఆనందదాయకమైన అనుభవాన్ని అందిస్తుంది. రివర్స్ కెమెరా కలిగిన పార్కింగ్ అసిస్టెంట్ ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్‌ను తేలిక చేస్తుంది. రివర్సింగ్ అసిస్టెంట్ పార్కింగ్ చేసిన చోటు నుంచి బయటకు తీసే సమయంలో లేదా ఇరుకైన దారిలో వెళ్లేసమయంలో సరిసాటిలేని మద్ధతు ఇస్తుంది. ఇది వాహనం ప్రయాణించిన 50 మీటర్ల దూరాన్ని రికార్డు చేస్తుంది మరియు స్టీరింగ్‌పై నియంత్రణకు సహకారాన్ని అందిస్తుంది.
సస్టెయినబిలిటీ శియర్ డ్రైవింగ్ ప్లెజర్ ప్రారంభం కావడానికి చాలా ముందుగానే BMW DNA లో ఉంది. BMW సెక్యులర్ ఎకానమీ ‘RE: THINK, RE: DUCE, RE: USE, RE: CYCLE’ తత్వం ప్రాథమిక ముడి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు ద్వితీయ వినియోగపు వస్తువులను పెంచుతుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడాన్ని పూర్తి విలువ శ్రేణి పరిధిలో మరియు లైఫ్ సైకిల్‌లోని అన్ని దశల్లోనూ సమగ్రమైన ప్రకృతి సిద్ధమైన మరియు రీసైక్లబుల్ మెటీరియల్స్ మరియు 100% గ్రీన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ద్వారా సాధిస్తుంది. బ్యాటరీ చాలా సంవత్సరాల తర్వాత నిరుపయోగమైన జీవితపు అంకానికి చేరుకున్నప్పటికీ, అది ఏ విధంగానూ పూర్తికాదు. తన సెకండ్-లైఫ్‌లో, బ్యాటరీ సెల్స్ సగటున మరో పదేళ్ల పాటు శక్తి నిల్వగా ఉపయోగించవచ్చు. బ్యాటరీ సెల్స్ ముక్కలు చేయబడిన తర్వాత, వాటి ముడి పదార్థాలను పూర్తిగా రీసైకిల్ చేయవచ్చు. లైఫ్ సైకిల్ పూర్తయినప్పటికీ, మళ్లీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది.