Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి రూ.80 కోట్లు
ముంబయి : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సలీల్ పరేక్ జీతం భారీగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 88 శాతం పెరిగి రూ.79.75 కోట్లకు చేరినట్లు గురువారం ఆ కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. దీంతో భారతదేశంలో అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ఇంతక్రితం ఏడాది 2020-21లో రూ. 49.68 కోట్ల వేతనం అందుకున్నారు. అదే విధంగా సలీల్ పరేఖ్ పదవీ కాలాన్ని మరో ఐదేండ్లు అంటే మార్చి 2027 వరకు పొడిగింపునకు ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయించింది. 2018 జనవరి నుంచి పరేఖ్ ఇన్ఫోసిస్ చీఫ్‌గా ఉన్నారు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వార్షిక వేతనం రూ.25.76 కోట్లుగా ఉంది. విప్రో సీఈఓ వేతనం రూ.64.34 కోట్లుగా, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ రూ.32.21 కోట్లు టెక్ మహీంద్రా చీఫ్ రూ.22 కోట్లు చొప్పున వేతనం అందుకుంటున్నారు.