Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ కంపెనీ కియా ఇండియా ఇటీవల ఇవి 6 పేరుతో నూతన కార్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని జూన్ 2న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా.. ఇప్పటి నుంచే ఇవి 6 బుకింగ్స్‌ను తెరిచినట్లు వెల్లడించింది. రూ.3 లక్షలు చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కియా తెలిపింది. 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని పేర్కొంది. 18 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని చెబుతోంది.