Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఒ జాక్ డోర్సీ ఆ సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. 2021 నవంబర్లోనే ట్విట్టర్ సీఈఓ పదవీకి ఆయన రాజీనామా చేసినప్పటికీ.. బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. తాజా నిర్ణయంతో డోర్సీ మళ్ళీ ట్విటర్ చీఫ్గా ఎన్నికవుతారనే రిపోర్టులకు తెరపడినట్లయ్యింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ పేమెంట్స్ ప్లాట్ఫాం 'బ్లాక్'కు ఆయన సారథ్యం వహిస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఇటీవల తన వైఖరీ మార్చుకున్న విషయం తెలిసిందే. సంస్థలో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని.. అవి తేలితే గాని ఒప్పందం ముందుకు జరగదని పేర్కొన్నారు. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.