Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూ వచ్చే ఏడాది భారత కార్ల అమ్మకాల్లో 10 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు గురువారం ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే భారత మార్కెట్లోకి తన సెడాన్ ఐ4 ఇవిని విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.69.9 లక్షలుగా నిర్ణయించింది. వచ్చే ఆరు మాసాల్లో మూడు ఇవిలను ఆవిష్కరించనున్నట్లు గతేడాది నవంబర్‌లో ఈ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మినీ ఎస్ఇ లక్షరీ హచ్బ్యాక్ను విడుదల చేసింది. ఈ రెండు వాహనాలతో భారత మార్కెట్లో 5 శాతం మార్కెట్ వాటాను చేరుకోగలమని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెండ్, సీఈఓ విక్రమ్ పవా విశ్వాసం వ్యక్తం చేశారు.