Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారు తమ ప్రతిభను పరీక్షల ద్వారా ప్రదర్శించి ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సాధికారత కల్పిస్తున్న దేశంలోని మొట్టమొదటి వేదిక అన్అకాడమీ రీలెవల్. ప్రతిభ ఆధారంగా దేశంలోని అత్యుత్తమ కంపెనీల్లో పనిచేసే అవకాశాలను యువభారత్‌కు అందిస్తోంది అన్అకాడమీ రీలెవల్. ఈ విజయపరంపరలో భాగంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న పోర్ల తేజ్శరణ్, నవనీత్ బోరారెడ్డి, సాయిప్రణయ్ కల్లెడ గురించి తెలియజేస్తోంది.
సైనిక నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన యువకుడు పోర్ల తేజ్శరణ్. ప్రయివేటు రంగంలో కాదు ఉద్యోగమంటూ చేస్తే ప్రభుత్వ రంగంలోనే చేయాలన్నది అతని సంకల్పం. కాని, కాలేజీలో లైసనింగ్, మార్కెటింగ్ టీమ్‌కు అతన్ని హెడ్‌గా ఎంపికయ్యాక కార్పొరేట్ కల అనే బీజం పడింది. ఈవెంట్స్ నిర్వహణ, క్లైంట్స్‌కు వాటి ధర తెలియజేస్తున్న సమయంలో తనలోని సామర్ధ్యం తేజ్‌కు అర్థమైంది. తన కలలకు మరింత ప్రాణం పోసింది అమెరికన్ సిరీస్ ‘సూట్స్”. కార్పొరేట్ ప్రపంచాన్ని అందులో చూపిన తీరు నచ్చి ఆ రంగంలో ప్రవేశించాలని ఆకాంక్షించాడు.
ఆ ఆలోచన అతనిలో ఉత్సాహం నింపింది. తన మొదటి ఉద్యోగంలోనే 3-వారాల టార్గెట్‌ను 4-5 రోజుల్లో పూర్తి చేయడంతో అతను టీమ్ లీడర్ అయ్యాడు. 21 సంవత్సరాల వయస్సులో సొంత టీమ్ కలిగి ఉండటం అతనిలో ఎంతో స్ఫూర్తి నింపింది. తన కెరీర్‌ను మరింత వేగంగా పెంచుకోవాలని భావించిన తేజ్‌కు రీలెవల్ బిజినెస్ టెస్టు ప్రయత్నించమని ఒక ఫ్రెండ్ సూచించాడు. ఆ టెస్ట్ ద్వారా తన ప్రతిభకు తగిన ఉద్యోగం దొరుకుతుందని చెప్పాడు.
ఆ ఉత్సాహంతో అతను పరీక్ష రాశాడు. కాని, ఫార్మాట్‌పై శ్రద్ధ అంతగా పెట్టకపోవడంతో మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. కాని, మరుసటి రోజే మరోసారి ప్రయత్నించడం విజయం సాధించాడు. నోవాబెనిఫిట్స్ సంస్థ అతన్ని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంది, అది కూడా 77 శాతం అధిక వేతనంతో.
తెలంగాణలోని సదాశివపల్లి అనే కుగ్రామానికి చెందిన యువకుడు నవనీత్. తనకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో తన తండ్రి రెక్కలు ముక్కులు చేసుకోవడం మాత్రమే అతను చూశాడు. డబ్బుకు ఇబ్బంది ఉన్నా ఆయన ఏనాడు తమ కుమారుడు, కుమార్తె పెద్ద కలలు కనకుండా కట్టడి చేయలేదు. ఒక చిన్న రిమోట్ అంత దూరం నుంచి టీవీని ఎలా కంట్రోల్ చేస్తుందో అర్థం కాక చాలా ఆశ్చర్యం వేసేదని గుర్తు చేసుకుంటాడు నవనీత్. ఆ జిజ్ఞాసే తనను ఇంజినీరింగ్ చదివేలా చేసిందని అంటాడు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అక్కకు అవకాశాలేవి రాకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ‘నవనీత్, నీకు ఉద్యోగం వచ్చి మొదటి వేతనం వచ్చిన రోజు అది నా జీవితంలో నేను సాధించినట్టు భావిస్తానని” ఆమె నవనీత్‌తో చెప్తూ ఉండేది. కోడింగ్, ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ఆమె తన ల్యాప్‌టాప్‌ను తమ్ముడికిచ్చేసింది.
ఆ రోజు నుంచి అతను తన రెండు కలలు సాకారం చేసుకునేందుకు శ్రమించాడు. ఒక సంవత్సరం తర్వాత రీలెవెల్ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచి మోఎంగేజ్లో ఉద్యోగం సంపాదించినప్పుడు మునుపెన్నడూ లేని ఆనందాన్ని పొందాడు. ఇదంతా ఏంటో అతని తల్లిదండ్రులకు పెద్దగా తెలియదు. డిగ్రీ పాసయ్యేందుకు ఇది మరొక పరీక్ష అని వారు అనుకున్నారు. చివరి ఇంటర్వ్యూలో మనం న్యూస్పేపర్లలో మాత్రమే చూసే పెద్ద కంపెనీ ఒకదానిలో అతను తన మొదటి ఉద్యోగాన్ని పొందాడు. ఆ రోజు తన అక్కకు కలిగిన ఆనందం అతను అంతకు ముందు ఎన్నడు చూడలేదు. ఇక తన విషయానికొస్తే తన కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి వమ్ము చేయకపోవడమే గొప్ప విజయమని భావిస్తాడు.
కాలేజీలో స్నేహితులతో కలిసి ప్రారంభించిన ఆన్లైన్ వ్యాపారం తన జీవితాన్ని మారుస్తుందని సాయిప్రణయ్ కల్లెడ ఏనాడు అనుకోలేదు. ఇంజినీరింగ్ చదివే రోజులలో అతను నీటి నుంచి బయట పడిన చేపలా తల్లడిల్లివాడు. అతని సహచరుల్లో చాలా మంది కార్పొరేట్ ప్రపంచంలో టెక్ రోల్స్ పోషించాలని ఉబలాటపడితే మరికొందరు చదువుకున్న కాలేజీలోనే ఫ్యాకల్టీ సభ్యులు కావాలని కోరుకున్నారు. అయితే, అవేవి తాను కోరుకునే భవిష్యత్తు కాదని సాయి ప్రణయ్‌కి తెలుసు. సొంతంగా ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదనే ఆలోచన అతనికి కలిగింది. దానికి ఒక పేరు కూడా నిర్ణయించుకున్నాడు. అదే టీ-షర్ట్ బాబా. దాన్ని గొప్పగా నిలబెట్టేందుకు మెదుడును బాగా పదును పెట్టాడు. సున్నా పెట్టుబడితో ప్రారంభించిన ఆ వ్యాపారం 25 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని అతను కలలో కూడా అనుకోలేదు.
టీ-షర్ట్ బాబా జీవితానికి అర్థం ఇవ్వడమే కాదు వ్యాపారం పట్ల మక్కువనూ పెంచింది. దాన్ని విస్తరించాలనే ఆలోచనే లేదు కాబట్టి దాన్ని మూసేయాల్సి వచ్చినా అది అతనికి భవిష్యత్త్‌పై స్పష్టతనిచ్చింది. వ్యాపారాన్ని విజయవంతంగా నడిపేందుకు దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే అర్థం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఎంబీఎ కోసం అప్లై చేసుకున్నాడు. కాని, మహమ్మారి కారణంగా దాన్ని చేపట్టలేకపోయాడు. కాని, వ్యాపారంలో తనదైన ముద్ర వేయాలనే సంకల్పం కారణంగా ఆ ఆలోచనను వదిలిపెట్టలేదు. అనుభవం సంపాదించేందుకు అమెజాన్‌లో సప్లై చైన్ కార్యకలాపాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు.
అది వ్యాపార నిర్వహణ వ్యవహారాలను అతనికి పరిచయం చేసింది కాని, సేల్స్‌పరంగా నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయం గ్రహించగలిగాడు. మరిన్ని అవకాశాల కోసం అతను అన్వేషిస్తున్న సమయంలో రీలెవల్ గురించి తెలిసింది, వెంటనే వారి బిజినెస్ డెవలప్మెంట్ టెస్టు రాయాలని నిర్ణయించుకున్నాడు. దాని వలన అతనికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం లబించడమే కాదు, అతని జీతంలో 50 శాతం పెరుగదల వచ్చింది.
టీ-షర్టు బాబా రోజుల్లో లభించిన విజయభావన మళ్లీ లభించిన భావన అతనికి కలిగింది. తాను సరైన మార్గంలో పయనిస్తున్నాననే ఆత్మవిశ్వాసం కలగడమే కాదు ఈ రంగంలో తన భవిష్యత్తుకు ఢోకా లేదని నమ్మకాన్ని అందించింది.