Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫోన్ పే కస్టమర్లు ఇప్పుడు UPI SIPతో అత్యంత స్వచ్ఛమైన 24K బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఏ సమయంలో అయినా పోగు చేసిన 24K బంగారాన్ని ఇన్సూర్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు ఉపసంహరించుకోవచ్చు.
హైదరాబాద్ : బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా UPI SIPను ఆవిష్కరించామని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్ల కంపెనీ PhonePe నేడు ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు ప్రతినెలా ఒక నిర్ధిష్ఠ మొత్తానికి అత్యంత స్వచ్ఛమైన 24K బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే తాము సేకరించిన బంగారాన్ని ఇన్సూరెన్స్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో భద్ర పరచుకోవచ్చు. ఈ లాకర్లను PhonePe భాగస్వామ్య సంస్థలు MMTC-PAMP మరియు SafeGold నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది.
PhonePeలో బంగారం SIPని ప్రారంభించడం వల్ల UPI సౌలభ్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. వినియోగదారు బంగారం సేవా సంస్థను ఎంచుకుని, నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని పేర్కొని, UPI పిన్ తో ప్రమాణీకరించుకుంటే చాలు. మన పని పూర్తయినట్టే! బంగారం SIPను సెట్-అప్ చేయడం అనేది ఒకసారి మాత్రమే, నిరంతరాయంగా చేయగల ప్రక్రియ. ఆ తర్వాతి పెట్టుబడులు అనేవి పూర్తిగా తనంత తానుగా జరుగుతాయి. వినియోగదారులు తమ బంగారం పెట్టుబడులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఏ సమయంలో అయినా బంగారాన్ని విక్రయించుకుని, బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసుకోవచ్చు. బంగారం నాణేలు, బార్ల రూపంలో తమ బంగారాన్ని ఉపసంహరించుకోవడం కూడా చేసుకుని, తమ ఇంటివద్దకే డెలివరీ చేయించుకోవచ్చు.
PhonePe యాప్ లో UPI SIP ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి:
నెలకు కేవలం వంద రూపాయలతో 24K బంగారం కొనండి: బంగారం SIP ద్వారా, వినియోగదారులు కనిష్ఠంగా వంద రూపాయల నుండి అత్యంత స్వచ్ఛమైన 24K బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. క్రమ పద్ధతిలో తమ బంగారం సేవింగ్స్ ను పెంచుకోవడానికి చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టవచ్చు.
ధరల హెచ్చుతగ్గుల గురించి ఆందోళన అవసరం లేదు: బంగారం SIP అనేది ఒక కాలానుగుణంగా పెట్టే పెట్టుబడి అయినందున, వినియోగదారులు పెట్టుబడి నిర్ణయం తీసుకునే క్రమంలో బంగారం ధరలను నిరంతరం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నిర్ధిష్ఠ విరామంలో బంగారం కోసం ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం దీర్ఘకాలంలో వినియోగదారుకు సగటు పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించగలదు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా PhonePe ఇన్వెస్ట్ మెంట్స్ విభాగం హెడ్ టెరెన్స్ లూసియన్ మాట్లాడుతూ, “తమ 380 మిలియన్ల మంది వినియోగదారుల యొక్క వేర్వేరు పెట్టుబడి అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు, ఆఫర్లను నిర్వహించాలన్నదే PhonePe దీర్ఘ కాలిక వ్యూహం. బంగారాన్ని కొనేందుకు భారతీయులు తెలివైన మార్గాలవైపు దృష్టి సారిస్తుండడంతో, మేము UPI ద్వారా బంగారం SIPను సెటప్ చేసే ఎంపికను మా వినియోగదారులకు అందించడం మాకెంతో సంతోషంగా ఉంది. చిన్న, రెగ్యులర్ నెలవారీ పెట్టుబడుల ద్వారా స్వచ్ఛమైన 24K బంగారాన్ని కొనేందుకు వారిని అనుమతించడం ద్వారా PhonePe యొక్క బంగారం SIP వినియోగదారులకు తమ దీర్ఘకాలిక బంగారం పెట్టుబడులను నిరంతరాయ మార్గంలో నిర్మించుకోవడంలో సహాయపడుతుంది.”
PhonePeలో బంగారం కోసం UPI SIP సెట్ అప్ చేయడంకోసం, మీరు కింది దశలను అనుసరించవచ్చు:
దశ 1: మీ PhonePe యాప్ హోమ్ పేజీలోని కింది పట్టీలో ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి.
దశ 2: పెట్టుబడి ఐడియాలు విభాగం కింద Gold/బంగారం ను ట్యాప్ చేయండి.
దశ 3: బంగారాన్ని పోగు చేయడం ప్రారంభించండి(Start Accumulating Gold)/Buy More Gold(మరింత బంగారం కొనండి)ని ట్యాప్ చేయండి.
దశ 4: ఒక సేవా సంస్థను ఎంచుకుని, తర్వాత, Invest Monthly/నెలవారీగా పెట్టుబడి పెట్టు (SIP)ను ఎంచుకుని, ప్రతినెలా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని, పెట్టుబడి తేదీని ప్రవేశపెట్టండి.
దశ 5: ‘Pay and set Autopay/పే చేసి, ఆటోపే సెట్ చేయి’ని ఎంచుకోవడానికి ముందుకెళ్లి, మీ UPI పిన్ తో నిర్ధారించండి.
దీంతో మీ పని పూర్తయినట్టే! మీ UPI బంగారం SIP విజయవంతంగా సెట్ అప్ చేయబడింది.
PhonePe పరిచయం
2015 డిసెంబర్ నెలలో స్థాపించబడిన PhonePe భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్ గా అవతరించింది. వినియోగదారులు, వ్యాపారులు లాంటి వారిని డిజిటల్ మార్గంలో మేళవించే వీలు కల్పించింది. 370 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగిన PhonePeను ప్రస్తుతం ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఉపయోగిస్తున్నారు. అంతేకాక, దేశంలోని 99శాతం పిన్ కోడ్లను కవర్ చేస్తూ, ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి, అంతకన్నా చిన్న పట్టణాలలోని 30 మిలియన్ ఆఫ్ లైన్ మర్చంట్లను కూడా ఈ సంస్థ డిజిటల్ మయం చేసింది. 2017లో ఆర్థిక సేవల రంగంలోకి అడుగు పెట్టిన PhonePe 24 క్యారెట్ల బంగారాన్ని కొనేందుకు సురక్షితమైన, సులభమైన మార్గాన్ని అందిస్తోంది. తన వేదికలో ఇటీవల వెండి కొనుగోలును కూడా ఆవిష్కరించింది. అప్పటినుండి, పన్ను ఆదా ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, అంతర్జాతీయ ప్రయాణ బీమా, జీవిత బీమా, కొవిడ్-19 బీమా లాంటి అనేకమైన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. PhonePeను ఉపయోగించి, వినియోగదారులు డబ్బు పంపడం, అందుకోవడం, మొబైల్, DTH రీఛార్జ్ చేయడం, దుకాణాలలో పే చేయడం, తమ వినియోగ పేమెంట్లు అన్నిటినీ చేయడం లాంటివి కూడా చేయవచ్చు.