Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్ ఫుర్జాన్లో అల్ర్టా లగ్జరీయస్ రెసిడెన్షియల్ మైలురాయి జెమ్జ్
డాన్యుబ్ గ్రూప్‌నకు బ్రాండ్ ప్రచారకర్తగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సంజయ్ దత్ ఎంపిక
· ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అత్యద్భుతమైన పిరమిడ్ ఆకృతి నిర్మాణం కలిగి ఉండటంతో పాటుగా ఓ మైలురాయిగా నిలువనుంది
· ఈ ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉండటంతో పాటుగా షేక్ జయేద్ రోడ్ లో ఉండటం చేత సౌకర్యవంతంగా ఉంటుంది.
· ప్రైమ్ లొకేషన్లో నిర్మాణం; ఈ ప్రాజెక్ట్ అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లను అందిస్తుంది. అత్యున్నత శ్రేణి వసతులనూ కలిగి ఉండటంతో పాటుగా ప్రజా రవాణా, మాల్స్‌కు అతి సమీపంలో ఉంది.
· జెమ్జ్ యొక్క భారీ ప్రవేశ లాబీ ఖచ్చితంగా తొలిచూపులోనే ప్రేమలో పడేటట్లు చేస్తుంది
· విలాసవంతమైన సౌకర్యాలైనటువంటి అత్యాధునిక జిమ్, యాంటీ కరెంట్ స్విమ్మింగ్ పూల్, విలాసవంతమైన గ్రీన్ ఔట్డోర్లు, 13వ అంతస్ధులో ఔట్‌డోర్ స్కైలాంజ్ తో ఈ ప్రాజెక్ట్ విలాసంతమైన జీవనాన్ని పునర్నిర్వచించనుంది
హైదరాబాద్ : అందుబాటు ధరలలో ప్రోపర్టీ డెవలప్మెంట్ చేయడంతో పాటుగా యుఏఈలో శక్తివంతమైన ప్రయివేటు రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన డాన్యుబ్ ప్రోపర్టీస్ నేడు జెమ్జ్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. దాదాపు 350 మిలియన్ దీరామ్స్ విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. అత్యద్భుతమైర పిరమిడ్ నిర్మాణశైలిలో ఉండటంతో పాటుగా విలాసవంతమైన భారీ గృహాలు మరియు ఫ్లోర్ ప్లాన్స్‌ను వినూత్నమైన కన్వర్టబల్ లేఔట్స్‌తో కలిగి ఉంటుంది. అందువల్ల 1బీహెచ్‌కె ఇంటిని 2 బీహెచ్‌కె , 2 బీహెచ్‌కె ఇంటిని 3 బీహెచ్‌కె గృహంగా మార్చవచ్చు.
ఈ సూపర్ ఎక్స్‌క్లూజివ్ ప్రాజెక్ట్ జెమ్జ్ 270 అత్యున్నతంగా డిజైన్ చేసిన అపార్ట్మెంట్లను 30 విలాసవంతమైన సౌకర్యాలతో అందిస్తుంది. డాన్యూబ్ ప్రోపర్టీస్ యొక్క ట్రెండ్ సెట్టింగ్ 1 % నెలవారీ చెల్లింపు ప్రణాళిక అత్యంత అందుబాటు ధరలో విలాసంగా 5,50,000 దీరామ్స్ ప్రారంభ ధరతో అందిస్తుంది.
జెమ్జ్ బై డాన్యూబ్‌ను అల్ ఫర్జాన్ అభివృద్ధి చేయనుంది. అత్యంత ఆహ్లాదకరమైన రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఇది. షేక్ జయేద్ రోడ్ మరియు మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్ నడుమ ఇది ఉంది. కేవలం షేక్ జయేద్ రోడ్‌కు నాలుగు నిమిషాల దూరంలో ఉన్న జెమ్జ్, ప్రతిపాదిత మెట్రోకు కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఉంటుంది. అలాగే అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో కేవలం 10 నిమిషాల దూరంలో ఇది ఉంటుంది. నగరంలో అతి ముఖ్యమైన ల్యాండ్‌మార్క్స్‌లో డిస్కవరీ గార్డెన్స్, ఐబీఎన్ బట్టూట్ట మాల్ కూడా ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్‌కు వరుసగా నాలుగు నిమిషాలు మరియు ఏడు నిమిషాల వ్యవధిలో ఉంటాయి.
ఇప్పటికే చక్కగా కనెక్ట్ అయిన ఈ ప్రాంతం, అల్ ఫర్జాన్, దుబాయ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్‌లో ఒకటి. ఇది అత్యంత సౌకర్యవంతమైన స్టోర్స్ కు నిలయంగా ఉండటంతో పాటుగా ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లు, రెస్టారెంట్లు,కేఫ్‌లు, సలోన్స్, బుక్‌షాప్స్, స్కూల్స్, హాస్పిటల్స్, క్లీనిక్స్, హోటల్స్ మరియు మరెన్నో ఉన్నాయి. చాలా వరకూ లైఫ్‌స్టైల్ వసతులు కవర్ చేయడంతో పాటుగా అల్ ఫర్జాన్లో జీవితం అత్యంత మనశ్శాంతిగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది సమకాలీనం కావడంతో పాటుగా వైవిధ్యమైన ఫ్యామిలీ ఓరియెంటెడ్ కమ్యూనిటీగా సౌకర్యం మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సంప్రదాయ జీవనంతో పాటుగా ఆధునిక జీవనశైలిని విలాసవంతమైన అపార్ట్మెంట్లతో కలిగి ఉంటుంది. దీనిలో విస్తృత శ్రేణిలో పచ్చదరం, ప్రపంచ శ్రేణి వసతులు ఉన్నాయి.
ఒక్క శాతం చెల్లింపు ప్రణాళిక మధ్య తరగతి ఆదాయ అద్దెదారులకు అతి సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా తుది వినియోగదారులు తమ సొంతింటి కలలను ఎలాంటి ఆర్ధిక కష్టాలను లేకుండా సాకారం చేసుకోవచ్చు. ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా గృహ వినియోగదారులకు మార్చేందుకు డాన్యుబ్ ప్రోపర్టీస్ నేడు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లను గృహ వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఆఫర్ ుతొలి రోజు బుక్ చేయండి, అంటే 28 మే న బుక్ చేయండి. పూర్తి స్థాయి ఫర్నీచర్ కలిగిన అపార్ట్మెంట్ ఉచితంగా పొందండి్.
ఆలోచనాత్మకంగా డిజైన్ చేయడంతో పాటుగా నిర్మాణాత్మకంగా వజ్రంలా ఉండే ఈ ప్రాజెక్ట్ అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్స్ను అత్యంత ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌తో అందిస్తుంది. విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన ఈ వసతులు ఈ ప్రాంతంలో మరే ఇతర డెవలపర్ వద్ద అందుబాటులో లేవు. ఇది ఆక్వా జిమ్, యాంటీ కరెంట్ మెషీన్‌తో ఉండటంతో పాటుగా విలాసం, శ్రేష్టతను కలిగి ఉంది.
ప్రయివేటు పూల్‌ను ఆలోచనాత్మకంగా అసాధారణ జీవనశైలికి స్ఫూర్తినందించేలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇతర ప్రత్యేక వసతులలో నానీ సూపర్ వైజర్‌తో కిడ్స్ కేర్ , మ్యాచ్ స్టాండర్డ్ నెట్ ప్రాక్టీస్‌తో క్రికెట్ పిచ్, యోగా సెంటర్ వంటివి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, అత్యాధునిక బ్యూటీ సలోన్ సుశిక్షితులైన సిబ్బందితో ఉంటాయి.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం పాల్గొన్నారు. డాన్యూబ్ ప్రోపర్టీస్‌కు నూతన బ్రాండ్ ప్రచారకర్తగా ఆయన ఎన్నికయ్యారు.
డాన్యూబ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీ రిజ్వాన్ సజాన్ మాట్లాడుతూ ‘‘తమ కంపెనీ సుదీర్ఘకాలంగా గృహ మరియు గోల్డెన్ వీసాలను మదుపరుల కోసం ప్రాసెస్ చేస్తోంది. తగిన మార్గదర్శకాలను అనుసరించే వారికి వీటిని అందిస్తుంది. అంటే 2మిలియన్, 5 మిలియన్ మరియు 10 మిలియన్ దీరామ్ సీలింగ్స్‌ను సెప్టెంబర్ 2022 నుంచి ప్రాసెస్ ఆరంభంతో ఇవి అందించనుంది` అని అన్నారు.
''దేశీయ మరియు భారతీయ గృహ కొనుగోలుదారులు దుబాయ్ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ పట్ల మహోన్నత విశ్వాసం చూపుతున్నారు. మరీముఖ్యంగా ఈ నగరాన్ని తమ రెండవ ఇంటిగా మలుచుకుంటున్నారు’’ అని శ్రీ రిజ్వాన్ సాజన్ అన్నారు. ‘‘ వీసాలో తాజా సంస్కరణలు మరియు రెసిడెన్సీ నిబంధనలు మారుతుండటం వల్ల ఇది ఇన్వెస్టర్లు మరియు గృహ కొనుగోలుదారులు సురక్షిత రెసిడెంట్ వీసాలను పొందగలుగుతున్నారు. భారీ సంఖ్యలో గృహ కొనుగోలుదారులు తగిన ప్రోపర్టీల కోసం వెదుకుతున్నారు’’ అని అన్నారు.
'సానుకూల వాతావరణం అందిస్తోన్న స్ఫూర్తితో మేము మా నూతన ప్రాజెక్ట్ జెమ్జ్‌ను ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇది ప్రపంచ శ్రేణి ఫీచర్లను అందించడంతో పాటుగా వసతులనూ అందిస్తుంది. అదే సమయంలో శాంతియుత వాతావరణం కూడా అందిస్తుంది. ఇది రెసిడెంట్లు, ప్రజలు నగర రద్దీ జీవితానికి దూరంగా మనశ్శాంతి వాతావరణం పొందేందుకు తోడ్పడుతుంది.ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు అపూర్వమైన స్పందన లభించింది. ఇందుకు సమయానికి తగిన డెలివరీ ఇవ్వడం నట్ల మా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.
‘‘భవంతుల మెటీరియల్స్‌లో మా శక్తివంతమైన ఫైనాన్స్ ఆధారంగా, మా ప్రస్తుత ప్రాజెక్ట్‌లలోని సైట్లు అన్నీ కూడా పూర్తి కావడానికి దగ్గరగా ఉండటంతో పాటుగా ప్రతి రోజూ వృద్ధి చెందుతున్నాయి. మా లక్ష్యం ఎప్పుడూ కూడా మేము వాగ్ధానం చేసినదే అందించడం. మీ కలల ఇంటిని సాకారం చేయడంతో పాటుగా మీ మోములలో చిరునవ్వు తీసుకురానుంది’’ అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ బిల్టప్ ఏరియా 5,30,000 చదరపు అడుగులు. దీనిని 101,000 చదరపు అడుగుల ప్లాట్ ఏరియాలో అభివృద్ధి చేశారు. ఈ 14 అంతస్తుల ప్రాజెక్ట్‌లో 270 అపార్ట్మెంట్లు, 24 స్టూడియో అపార్ట్మెంట్లు ఉండగా 74 1బీహెచ్‌కె, 114 2 బీహెచ్‌కె ; 42 3బీహెచ్‌కె అపార్ట్మెంట్లు ఉండగా, 16 అపార్ట్మెంట్లు డూప్లెక్స్ అపార్ట్మెంట్లు.
తెలివైన ఫర్నిషింగ్స్ను పరిచయం చేయడంతో జెమ్జ్, భారీ గృహాలు మరియు ఫ్లోర్ ప్లాన్స్‌ను కన్వర్టబల్ లేఔట్స్‌తో కలిగి ఉంది. దీనిలో ఒన్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌ను 2 బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌గా మార్చడంతో పాటుగా 2 బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌ను 3 బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌గా మార్చవచ్చు. జెమ్జ్ వద్ద విలాసవంతమైన అపార్ట్మెంట్లు స్విమ్మింగ్ పూల్, బాల్కనీలో కలిగి ఉంది. ఇది అత్యద్భుతమైన విలాసంగా నిలుస్తుంది !
అక్టోబర్ 2022 తరువాత జెమ్జ్ ఆవిష్కరించనున్న మూడవ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇది. అంతేకాదు డీహెచ్300 మిలియన్ పెరల్జ్ ప్రాజెక్ట్‌ను ఫర్జాన్‌ను మార్చి 2022లో ఆవిష్కరించిన తరువాత రెండవ ప్రాజెక్ట్.
జెమ్జ్ ఆవిష్కరణతో , డాన్యూబ్ ప్రోపర్టీస్ డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో 8277 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ డీహెచ్ 5.7 బిలియన్కు విస్తరించింది. ఇది ఇప్పటి వరకూ 4556 యూనిట్లకు విస్తరించింది. వీటి మొత్తం విలువ 3.63 బిలియన్ దీరామ్‌లు. ఇది మొత్తం పోర్ట్ఫొలియోలో రెండింట మూడొంతులుగా ఉంది.
యుఏఈ లో అత్యంత విజయవంతమైన డెవలపర్లలో ఒకటిగా అత్యధిక లాంచ్ టు డెలివరీ రేఫియో కలిగి ఉంది. డాన్యూబ్ గ్రూప్ ఇప్పటికే బాయ్జ్, గ్లామ్జ్, స్టార్జ్, రిసార్ట్జ్, లాన్జ్ డెలివరీ చేసింది. ఇది ఇటీవలనే బాయ్జ్, మిరాకల్జ్ను డెలివరీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ కూడా వినియోగదారులనుంచి ప్రశంసలు పొందాయి.