Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నంకు ప్రపంచశ్రేణి , అందుబాటు ధరలలో క్యాన్సర్ చికిత్సను తీసుకువచ్చిన మేదాంత
విశాఖపట్నం: తొలి దశలోనే క్యాన్సర్ సంబంధిత సమస్యలను గుర్తించడంతో పాటుగా వాటికి తగిన చికిత్సనందించడంలో భాగంగా మేదాంత గురుగ్రామ్ ఇప్పుడు వైజాగ్‌లోని వైజాగ్ చెస్ట్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రపంచశ్రేణి నిపుణుల సలహాలు మరియు చికిత్సా మార్గదర్శకాలను ప్రజలకు అందిస్తోంది. డాక్టర్ మోహన్ వెంకటేష్ పుల్లె, అసోసియేట్ కన్సల్టెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ– చెస్ట్ ఆంకో సర్జరీ మరియు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్– మేదాంత గురుగ్రామ్ నేడు విశాఖపట్నంలోని రోగులను పరీక్షించారు. భారతదేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మద్యం , ఊబకాయం, నిశ్చల జీవనశైలి వంటివి దీనికి కారణమవుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. 50 ఏళ్ల లోపు వ్యక్తులలో ప్రమాదం తక్కువగా ఉంటే 65 సంవత్సరాలు దాటిన వారిలో ఇది అధికంగా ఉంటుంది అని డాక్టర్ పుల్లె చెప్పారు.
డాక్టర్ పుల్లె, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌ను జనరల్ సర్జరీ, థొరాకిక్ సర్జరీ అంశాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి అందుకున్నారు. లంగ్ క్యాన్సర్చ థిమోమా, ట్రాచియో బ్రాంకియల్, ఈసోఫాగల్ క్యాన్సర్‌కు సంబంధించి మినిమల్లీ ఇన్వాసివ్ థొరాకిక్ సర్జరీ పరంగా అపార అనుభవం ఆయనకు ఉంది.
క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభం. క్యాన్సర్ మరియు సంబంధిత చికిత్స కోసం 99994 61292కు కాల్ చేయవచ్చు.