Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రష్యాలోని చమురు, సహజ వాయువు ఆస్తుల కొనుగోళ్లపై ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా దృష్టి పెట్టింది. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ గెయిల్ ఈ యోచన చేయడం విశేషం. వాణిజ్యపరంగా ఈ అవకాశాన్ని ఎవరూ వదలుకోలేరని గెయిల్ ఉన్నతాధికారి మనోజ్ జైన్ పేర్కొన్నారు. రష్యాలో తాము ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నామన్నారు. 2020 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో గెయిల్ ఇండియా 40 శాతం వృద్థితో రూ.2,683.11 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,908 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2021-22లో లాభాలు రెట్టింపై రూ.10,363 కోట్లకు చేరాయి.