Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎఫ్‌ఓలు సిఇఓలకు కో-పైలెట్లుగా, సుస్థిరతా ఛాంపియన్లుగా, ఎం&ఎ శక్తియుక్తులు కలవాళ్ళు, కథకులు అయి ఉండాలన్న క్రియా విశ్వవిద్యాలయం మరియు డి&బి అధ్యయనం
● నిఫ్టీలో సిఎఫ్ఓలపై క్రియా విశ్వవిద్యాలయం మరియు డన్ డ బ్రాడ్షీట్ల పరిమాణాత్మక మరియు గుణాత్మక అధ్యయనం నిభవిష్యత్ సిఎఫ్ఓ: మారుతున్న పాత్రలు, మారుతున్న అధ్యయనాలుుకు 250 మంది హాజరు
● నైపుణ్యవంతమైన మానవ వనరులు , విస్తృతమైన భాగస్వామ్య నిర్వహణ, డిజిటలైజేషన్ మరియు నిలకడలతో ప్రేరేపితమయ్యే కొత్త- తరం పాత్రలను నిర్వహించడం సిఎఫ్ఓలకు అతి పెద్ద సవాళ్ళు
● ఎంబిఎ డిగ్రీ ఉన్న ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు వేగవంతమైన కెరీర్ వృద్ధిని పొందుతున్నారు
హైదరాబాద్ : కొత్త-తరం సిఎఫ్ఓలకు మారుతున్న ప్రాధాన్యతలు, కొత్తగా దృష్టి కేంద్రీకరించాల్సిన రంగాలు, వైవిధ్యమైన నైపుణ్యతా అంశాలను గుర్తించడానికి చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైన విషయాలను క్రియా యూనివర్సిటీకి చెందిన ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్, మరియు డన్ & బ్రాడ్షీట్ (డి&బి) ఈరోజు ప్రకటించాయి. 'భవిష్యత్ సిఎఫ్ఓ: మారుతున్నపాత్రలు, మారుతున్నలక్ష్యాలుు` శీర్షికతో చేపట్టిన ఈ అధ్యయనం డజన్లమంది భారతీయసిఎఫ్ఓల పరిమాణాత్మకమైన మరియు గుణాత్మకమైన అంతర్దృష్టులు, మారుతుతున్న సిఎఫ్ఓల పాత్రపై వివరణలు, నేడు మరియు రేపు సిఎఫ్ఓలకు అవసరమైన కీలక సామర్థ్యాలు మరియు యోగ్యతలు, సిఎఫ్ఓలకు మారుతున్న ప్రాధాన్యతలు మరియు కొత్త బాధ్యతలు తదితర అంశాల ఆధారంగా సాగింది. గత అయిదేళ్ళుగా సంఖ్యాపరంగా భారతీయ సిఇఓలకు సంబంధించిన ఆసక్తికరమైన మార్పులను కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.
క్రియా యూనివర్సిటీలో ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్రో వైస్-ఛాన్సలర్ శ్రీ రామ్‌కుమార్ రామమూర్తి మాట్లాడుతూ 'సాంకేతికత అనేది వ్యాపార భాషగా మరింత మారుతోంది, సుస్థిరత అనేది అంతర్లీనమైన వ్యాకరణం అయింది. వేగవంతమైన డిజిటలీకరణ మరియు ఇఎస్జిల మీద నిశితమైన దృష్టి కేంద్రీకరణ సిఎఫ్ఓ కార్యాలయంలో ఒక పునరుజ్జీవనాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఈ రోజు సిఎఫ్‌ఓలు బహుళమైన పాత్రలు పోషిస్తున్నారు.- వారు కేవలం ఆర్థిక విషయాల్లోనే కాదు, వ్యూహాత్యక అంశాలలో కూడా సిఇఓలకు నమ్మకమైన భాగస్వాములు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడంలో బోర్డు వివేకాన్ని కొనసాగిస్తున్నారు, వెనుకచూపు, అంతర్దృష్టి, దూరదృష్టి అందించడం కోసం ఆర్థిక డేటాను విశ్లేషించి వివరించే కథకుడిగా ఉంటున్నారు, మిగిలినవాటితో పాటు కీలకమైన వ్యాపారాల్తో సమరేఖలో ఉండే తదుపరి తరం స్టార్టప్‌లలో మదుపు చేసే ఒక పిఇ ఆలోచనాధోరణితో ఒక మదుపుదారుగా ఉంటున్నారు. వారి సంస్థలను ప్రయోజనంతో కూడిన బ్రాండ్లుగా మార్చడానికి, లాభదాయకమైన వృద్ధిని నడపడానికి, వాటాదారుల సంతృప్తిని పెంపొందించడానికి, పోటీ భేదాన్ని పెంచడానికి వీలుగా కొత్త-తరం సిఎఫ్ఓలకు అవసరమైన నైపుణ్యాలు, గుణాలు మరియు పనితీరును ఈ అధ్యయనం పరిశీలిస్తుంది` అని అన్నారు.
ప్రీత మిశ్రా, సీనియర్ డైరెక్టర్, డన్ డ బ్రాడ్కాస్ట్ మాట్లాడుతూ 'ఏ వ్యాపారానికైనా ఒక సిఇఓ మరియు ఒక సిఎఫ్ఓల మధ్య ఉండే అనుబంధం కీలకం. వ్యాపార వృద్ధిని ముందుగా ఊహించగలిగే సామర్థ్యం ఒక సిఎఫ్ఓకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం అని మా అధ్యయనం గుర్తించింది. సిఇఓకు విశ్వాసపాత్రుడైన భాగస్వామిగా, సిఎఫ్ఓలకు మార్కెట్ తాలూకు కొత్త డిమాండ్లను తీర్చడానికి సరికొత్త నైపుణ్యాలు అవసరం. సంస్థాగత రూపాంతరీకరణలో విజయం సాధించడానికీ, ప్రస్తుతం ఉన్న సవాళ్ళను నిర్వహించడానికీ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికీ ఫైనాన్స్ బృందం ఇప్పుడు బహుళ-విభాగాల్లో నైపుణ్యం ఉన్న బృందంగా మారాల్సిన అవసరం ఉంది` అని చెప్పారు.
కీలకమైన ముఖ్యాంశాలు:
నైపుణ్యవంతమైన మానవ వనరులు సిఎఫ్ఓలకు అతి పెద్ద ఆందోళనల్లో ఒకటిగా ఉంది. కెరీర్‌కు ఎంబిఎ చోదకశఖ్తి. నిఫ్టీ 250 కంపెనీల్లో, 2022 ఆర్థిక సంవత్సరంలో, నాన్-ఎంబిఎ అర్హతలతో ఉన్న 35% మందితో పోలిస్తే, ఎంబిఎ చేసిన సిఇఓల్లో 47% మంది 50 ఏళ్ళ లోపువారు. ఉన్నారు. సంప్రదాయికంగా సిఎఫ్‌ఓలు నాయకత్వం వహించే అంశాలైన- అకౌంటింగ్, ఆడిటింగ్, ఆర్థిక విశ్లేషణ, ప్లానింగ్, మదుపుదారులతో సబంధాలు, ఆర్థిక రిస్క్ మేనేజిమెంట్, ఉత్పత్తుల ప్రైసింగ్, నియంత్రణలకు అనుగుణంగా ఉండడం లాంటి వాటి నుంచి- సిఎఫ్‌ఓలు ప్రస్తుతం కార్పొరేట్ వ్యూహాలు, సంస్థాగత రూపాంతరీకరణ, డిజిటలైజేషన్, సంస్థాపరమైన రిస్క్ మేనేజిమెంట్, ఇఎస్జి అమలు లాంటి వాటిలో ఎక్కువ నిమగ్నమవుతున్నారు, రాబోయే అయిదేళ్ళలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సిన విషయాలు ఇవే అవుతాయని వారు భావిస్తున్నారు.
నాయకులు మాటలను ఆచరణలో పెట్టాలి. ఎగ్జిక్యూటివ్ స్థాయిలలో వైవిధ్యాన్ని పెంచడానికి బోర్డుల ద్వారా ప్రకటించిన వాగ్దానాలు వాస్తవిక నియామకాల్లో ప్రతిబింబించడం లేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో, నిఫ్టీ 50 కంపెనీలకు మహిళా సిఇఓ లేరు, నిఫ్టీ 250 కంపెనీల్లో ఈ సంఖ్య 5% కన్నా తక్కువగా ఉంది.
86% మంది సిఎఫ్‌ఓలు అనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌ఛైన్, క్రౌడ్-ఆధారిత సిస్టమ్స్ లాంటి డిజిటల్ సాంకేతికతలకు అత్యధిక ప్రాధాన్యం ఉస్తున్నారు, ఇవి సిఎఫ్‌ఓలు నిరికార్డుల వ్యవస్థలు నుంచి నినిమగ్నత మరియు ఇంటలిజెన్స్ వ్యవస్థలువైపు మరింత ఎక్కువగా మళ్ళడానికి దోహదం చేస్తున్నాయి. కొత్తతరం సమర్థతలు కొత్తతరం సాంకేతికతల వైపు ఎక్కువగా నడిపించడానికి ఇది తోడ్పడుతోంది.
సంస్థ వ్యాప్తంగా ఉన్న బృందాలతో సమాచారం, సహచర్యాలతో సహా గొప్ప వ్యక్తుల-ఆధారిత నైపుణ్యాల ద్వారా అనుబంధ మూలధనాన్ని సిఎఫ్‌ఓలు పెంచాల్సిన అవసరం ఉంది.
బహుళమైన వాటాదారులకు వ్యాపారం, కార్యకలాపాలు, వ్యాపార వ్యూహాలకు సంబంధించి విస్తృతమైన కార్పొరేట్ ప్రయోజనాల్ని వివరించడానికి సిఎఫ్‌ఓలు కథకులుగా మారాలి.
అస్థిరతను తగ్గించడానికి మూలధనాన్ని కేటాయించడంతోపాటు, వ్యాపార స్థిరత్వాన్ని రూపుదిద్దడానికీ, బహిరంగంగా ప్రకటించిన సుస్థిరతా లక్ష్యాలను సాధించడానికి కొత్త ఆర్థిక నమూనాలు సిఎఫ్‌ఓలు సృష్టించాల్సి ఉంది.
దేశంలో ఆర్థిక వృత్తులలో సామర్థ్యాలనూ, యోగ్యతలనూ సుసంపన్నం చెయ్యడం కోసం ఈ కీలకమైన అంశాల్లో, కొత్త తరం నైపుణ్యాల్లో కొత్త తరం కార్యక్రమాలను విద్యా సంస్థలు, వృత్తిపరమైన సంస్థలు రూపొందించాలి.