Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన కుమారి నిఖత్ జరీన్‌ను సోమవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో సత్కరించారు. జరీన్ బీఓఐలో తెలంగాణ జోన్ అధికారిగా ఉన్నారు. టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత జోనల్ కార్యాలయాన్ని ఆమె తొలిసారిగా సందర్శించిన నేపథ్యంలో సిబ్బంది అందరూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్బీజీ సౌత్2 జనరల్ వివేకానంద్ దూబే, తెలంగాణ జోన్ జోనల్ మేనేజర్ సువేందు కుమార్ బెహెరా, ఇతర సిబ్బంది ఆమెను అభినందించారు. 2021లో తాను బ్యాంక్‌లో నియమితులైన రోజు నుంచి ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు సంస్థకు తన కృతజ్ఞతలని జరీన్ పేర్కొన్నారు.