Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఏపీ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ అయినా ఉమేష్ చంద్ అసవా కొత్తగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)లో చేరిన సందర్బంగా ఆ కమిటీ సభ్యులు అభినందించారు. సోమవారం ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమేష్ చంద్‌కు ఐబీఏ ఛైర్మన్ రాకేష్ శర్మ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల చీఫ్‌లు హాజరయ్యారు.