Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్లోబల్ టెక్నలాజీ బ్రాండ్ వన్ ప్లస్ భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 10ఆర్‌ను విడుదల చేసిన ట్టు ప్రకటించింది. దీన్ని మీడియా టెక్ డైమెన్సిటీ 8100-మాక్స్ చిప్ సెట్ ద్వారా డిజైన్ చేసినట్లు పేర్కొ ంది. దీర్ఘకాల, అత్యంత అధునాతన కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందని తెలిపింది. 10 నిమిషాల చార్జింగ్‌తో ఒక్క రోజుకు కావాల్సిన శక్తి అం దించగలదని పేర్కొంది. వెనుకాల 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్ 766 కెమెరాతో పాటు 2ఎంపి, 8ఎంపి కెమెరాలతో పాటు సెల్ఫీ కోసం 16 ఎంపి కెమెరాలను అమర్చినట్లు తెలిపింది. రెండు వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధరలను రూ.38,999గా, రూ.43,999గా నిర్ణయించినట్టు వెల్లడించింది.