Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈక్విటీ మార్కెట్ పె ట్టుబడులపై ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ. 42,000 కో ట్ల లాభాలు సంపాదించినట్టు వె ల్లడించింది. ఇంతక్రితం 2020 -21లో ఈ సంస్థ రూ.36వేల కోట్ల లాభాలు ఆర్జించింది. ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ మొత్తం అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)లో దాదాపు 25 శాతం ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులుగా ఉన్నాయన్నారు. ''ఎల్ఐసీ మొత్తం ఆస్తులు రూ.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో 25 శాతం ఈక్విటీ మార్కెట్లో ఉన్నాయి. ఇందులో లాభాలు ఆర్జిస్తున్నాము. దీర్ఘ కాల లక్ష్యంతో పెట్టుబడులు కొనసాగు తాయి. పాలసీదారులకు బోన స్లను చెల్లించాలంటే.. 10-15 ఏండ్ల దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షల కోట్ల లాభాలు ఆర్జించాం. కానీ ఒక్క ఏడాదిలోనే లాభాలు సాధించలేం. పాలసీదారుల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది' అని కుమార్ పేర్కొన్నారు.