Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగం లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓ ఎం) 2022 మార్చితో ముగిసిన ఏడాదిలో రుణాల జారీలో 26 శాతం వృద్ధితో రూ.1,35,240 కోట్లకు చేరి నట్టు వెల్లడించింది. పూణె కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ, డిపాజిట్లతో పోల్చితే మెరుగైన ప్రగతిని కనబర్చి నట్టు పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు వరుసగా 10.27శాతం, 9.46 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయగా.. తమ సంస్థ మరింత పెరుగుదలను నమోదు చే సిందని బీఓఎం ఓ ప్రకటనలో తెలిపింది. డిపాజిట్లలోనూ 16.26శాతం వృద్ధితో రూ.2,02,294 కోట్లకు చేరినట్టు తెలిపింది. మొత్తం వ్యాపారంలో 20శాతం వృద్ధితో రూ.3,37,534 కోట్లుగా నమోదయి నట్టు పేర్కొంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు కూడా 7.23 శాతం నుంచి 3.94 శాతానికి తగ్గాయని వెల్లడించింది. 2021-22లో బ్యాంక్ నికర లాభాలు రెట్టింపై రూ.1,152 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25-30 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.