Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సలసర్ టెక్నో ఇంజనీరింగ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.1,182 కోట్ల ఆర్డర్లను సాధించినట్టు వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది 2020-21లో రూ.988 కోట్ల ఆర్డర్లను నమోదు చేసినట్టు పేర్కొంది. 2022 మార్చితో ముగిసిన ఏడాదిలో రూ.938 కోట్ల ఆర్డర్లు ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల నుంచి లభించాయని, రూ.200 కోట్లు ఎగుమతుల నుంచి వచ్చాయని తెలిపింది. 2021-22లో రూ.31.5 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది రూ.29.8 కోట్ల లాభాలు నమోదు చేసింది.