Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ రేట్లు పెంచిన పలు బ్యాంక్లు
న్యూఢిల్లీ : రుణ గ్రహీతలపై వడ్డీ భారం పడనుంది. పలు బ్యాంక్లు గృహ, వాహన, రిటైల్ తదితర రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. పాత, కొత్త రుణ గ్రహీతలపై కనీసం 5 బేసిస్ పాయింట్ల నుంచి 40 బేసిస్ పాయింట్ల మేర పెంచాయి. జూన్ 1 నుంచి గృహ రుణాలపై హెచ్డీఎఫ్సీ తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (ఆర్పీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లను పెంచింది. ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 6.65 నుంచి 7.05 శాతానికి చేర్చింది. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు కూడా రుణాలపై 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచాయి. ఇటీవల ఆర్బీఐ రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంక్లు ఆ భారాన్ని ఖాతాదారులపై మోపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్యాంక్లు జూన్ 1 నుంచి రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి.