Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే నెలలో 16శాతం క్షీణత
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే 2022 మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 4.1శాతానికి పరిమితమయ్యింది. అధిక ధరల డిమాండ్‌ను దెబ్బతీయడంతో అమ్మకాలు పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పడిపోయాయి. ప్రస్తుత ఏడాది మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లకు తగ్గాయి. ఇంతక్రితం ఏప్రిల్‌లో రికార్డ్ స్థాయిలో రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో ఇతర ఉత్పత్తుల ధరలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ప్రజల కొనుగోళు శక్తి హరించుకుపోతున్నది. ఈ ప్రభావం ప్రత్యక్షంగా పన్ను వసూళ్లపైన పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో పన్ను వసూళ్లు తక్కువగానే ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ. 25,036 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ. 32,001 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 73,345 కోట్లు, పరిహారం సెస్ రూ. 10,502 కోట్లుగా నమోదయ్యింది.