Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మోటోరోలా ఇండియా తన 'స్టైలిష్ ఎంటర్టైనర్' అయినటువంటి మోటో ఇ32ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ లాంటి 60,000+ రిటైల్ స్టోర్లలో జియో మార్ట్ డిజిటల్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ బడ్జెట్ విభాగంలో అందరికి అందుబాటులో ఉంటుంది. మన్నికైన డిజైన్, మోటో ఈ32ఎస్ ప్రీమియం పీఎమ్ఎమ్ఏ ఫినిష్, సెగ్మెంట్ యొక్క మొదటి ఐపీ52 రేటింగ్, అల్ట్రా స్లిమ్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. పంచ్ హోల్ డిజైన్‌తో అద్భుతమైన 90హెచ్‌జెడ్ 6.5” ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టిమైజ్ చేయబడింది.
మోటో ఈ32ఎస్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు డిస్ప్లేతో పాటుగా సెగ్మెంట్ యొక్క మొదటి ఆండ్రాయిడ్™ 12 ఆపరేటింగ్ సిస్టమ్, సులువైన వినియోగదారు అనుభవాన్ని అందించడం, అద్భుతమైన 16 మెగాపిక్సెల్ ఏఐ - పవర్డ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా 15 వాట్స్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు 40 గంటల పాటు ఛార్జింగ్‌ను పొందే అవకాశం ఉంది. మోట్ ఈ32ఎస్ క్లాస్ లీడింగ్ సెక్యూరిటీ ఫీచర్లు మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పనితీరును కలిగి ఉంది. దీంతోపాటు మీడియాటెక్ యొక్క లేటెస్ట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఎల్‌పిడీడీఆర్4ఎక్స్ ర్యామ్ దాని విభాగానికి అసాధారణమైన పనితీరును అందిస్తుంది.
మోటో ఈ32ఎస్ 3జీబీ + 32జీబీ మరియు 4జీబీ + 64జీబీ వేరియంట్లలో రెండు సిమ్ స్లాట్లతో పాటు 1టీబీ వరకు ప్రత్యేక మైక్రో SD స్లాట్‌తో వస్తుంది. అత్యంత ఆప్టిమైజ్ చేయబడిన బ్రాడ్‌బ్యాండ్ మరియు 4జీ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వై-ఫై మరియు 2X2 మిమోతో సహా సెగ్మెంట్ యొక్క ఉత్తమ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ32ఎస్ వస్తుంది.
అందుబాటు మరియు ధర వివరాలు
స్లేట్ గ్రే మరియు మిస్టీ సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది, జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి జియో మార్ట్ డిజిటల్, రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
- 3జీబీ + 32జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన రూ.8999 ప్రారంభ ధరతో
- 4జీబీ + 64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 9,999 లకే
- జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్ మరియు రిలయన్స్ డిజిటల్లో పరిమిత స్టాక్‌పై ఆఫర్ అందుబాటులో ఉంటుంది.