Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలకు తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రమంగా పడిపోవడంతో భారత్‌లో బంగారం రోజు రోజుకు ప్రియం అవుతోంది. తాజాగా గురువారం సెషన్లో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ధర రూ.434 పెరిగి రూ.50,887కి చేరిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్లో ఈ లోహం ధర రూ.50,453గా పలికింది. కిలో వెండిపై రూ.918 పెరిగి రూ.61,776 వద్ద నమోదయ్యింది. ప్రపంచ మార్కెట్లో ఒక్క ఔన్స్ పసిడిపై 22 డాలర్లు పెరిగి 1,852 డాలర్లుగా నమోదయ్యింది.