Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ మోటారోలా గురువారం భారత మార్కెట్లోకి మోటో ఈ32ఎస్‌ను విడుదల చేసింది. అల్ట్రా-ప్రీమియం డిజైన్, 6.5 అంగుళాల 90హెచ్‌జెడ్ ఫ్లూయిడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 లాంటి ఫీచర్లు కలిగిన ఈ 3జీబీ రామ్ ఫోన్ ధరను రూ.8,999గా, 4జీబీ, 32జీబీ ర్యామ్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. ఇది జూన్ 6 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ లభించనుందని పేర్కొంది. 16మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5000ఎమ్ఎహెచ్ బ్యాటరీతో లభ్యమవుతుందని తెలిపింది.