Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సరియైన శిక్షణ లేని పైలట్‌కు విమాన ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినందుకుగాను విస్తారా ఎయిర్‌లైన్స్‌కు రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. సిమ్యులేటర్ శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విస్తారా విమానాన్ని ల్యాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. దీంతో విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అంటూ డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఈ విమానం ఎక్కడ నుంచి బయలుదేరింది, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టత లేదు. ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్‌లో పైలట్‌కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. కెప్టెన్, పైలట్ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన చర్య అని డీజీసీఏ పేర్కొంది.