Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ యొక్క రుణ విభాగం, ఆర్థిక సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన ప్రజా అవగాహన కార్యక్రమం ‘ప్రతి సారీ సకాలంలో ఈ ఎంఐ’ ను ప్రారంభించింది. ఇది ఆరోగ్యదాయక ఆర్థిక భవిష్యత్ కోసం చక్కటి ఆర్థిక అలవాట్లను అనుస రిం చాల్సిన అవసరం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచేందుకు చేపట్టిన డిజిటల్ కార్యక్రమం. తమ రుణాలకు సంబంధించి నెలవారీ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరి యు రుణాల చెల్లింపులలు చేయకపోతే అది దీర్ఘకాలంలో వారి ఆర్థిక ఆరోగ్యంపై కనబరిచే ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. మార్కెట్లో లభ్యమయ్యే వివిధ ఆర్థిక సేవల ప్ర యోజనాలను ఆనందించేందుకు చెల్లింపుల కట్టుబాట్లను పాటించేందుకు గాను క్రమశిక్షణను అలవర్చుకో వడం ఆవశ్యకతపై ఈ క్యాంపెయిన్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ బ్రాండ్ క్యాంపెయిన్ గుప్తాజీ చేసే ‘అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి’ అనే బోధనను చాటిచె బుతుంది. టింకూజీ ఎంతో వినోదాత్మకంగా, ఉల్లాసభరితంగా తన ఈఎంఐలను సకాలంలో చెల్లించడాన్ని ఇం దులో చూడవచ్చు. వాయిదాలు చెల్లింపు చేయకపోవడం లేదా లేట్ పేమెంట్ చేసినా చోటు చేసుకునే వివి ధ పరిణామాలపై ప్రజల్లో ఇది అవగాహన కల్పిస్తుంది. భవిష్యత్ లో రుణాలను తీసుకోవడాన్ని సులభం చే సేలా క్రెడిట్ స్కోర్ ను పెంచుకునేందుకు తిరిగి చెల్లింపులను సకాలంలో చెల్లించాల్సిన అవసరంపై దృష్టి పెట్టే లా చేస్తుంది.
ఈ డిజిటల్, బహుభాషా క్యాంపెయిన్ ను వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, కస్టమర్ పోర్టల్, ఐవీ ఆ ర్, మొబైల్ యాప్ వంటి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అన్ని డిజిటల్ ప్రాపర్టీలతో పాటుగా ఇతర మీడి యా ఇన్ఫోటెయిన్ మెంట్ చానల్స్ లో కూడా చూడవచ్చు.
దిగువ కీలకాంశాలను గుర్తుంచుకోవాల్సిందిగా కస్టమర్లకు ఈ క్యాంపెయిన్ సూచిస్తుంది:
1. సకాలంలో ఈఎంఐ చెల్లింపులతో కలిగే ప్రయోజనాలు
2. ఈఎంఐ లేట్ గా చెల్లించడం వల్ల కలిగే పరిణామాలు
3. భవిష్యత్ రుణాల కోసం తమ క్రెడిట్ స్కోర్ ను ఆరోగ్యంగా ఉంచుకునే విధానాలు
4. కీలక ఫైనాన్షియల్ పదజాలం యొక్క సరళమైన అర్థాలు
‘ప్రతిసారీ సకాలంలో ఈఎంఐ’ అనేది 2022 ఫిబ్రవరిలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడిన ‘ఏబీసీ ఆఫ్ ఈఎంఐ’ ఒరిజినల్ ఎడ్యుకేషన్ సిరీస్ కు పొడిగింపు. ఈఎంఐ అర్థం, దానితో ముడిపడిన వడ్డీరేటు, జీరో డౌన్ పేమెంట్, క్రెడిట్ స్కోర్ లాంటివి అందులో వివరించబడ్డాయి.
ఎప్పుడూ సకాలంలో ఈఎంఐ చెల్లించేందుకు కారణాలు:
- ఆరోగ్యదాయక క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యం: భవిష్యత్ ఆర్థిక అవసరాలపై ఇది దీర్ఘకాలిక ప్రబావం కలిగి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక ప్రొఫైల్ లో గణనీయం భాగం. రుణం కోసం దరఖాస్తు చేసిన సందర్భంలో రుణగ్రహీతకు రుణం ఇచ్చేందుకు గాను రుణదాతలు సిబిల్ స్కోర్ ను తనిఖీ చేస్తారు. రుణగ్రహీత క్రెడిట్ హెల్త్ సరిగా ఉండాలంటే నిలకడతో కూడిన ప్రయత్నాలు, ఆర్థిక క్రమశిక్షణ అల వాట్లు కలిగి ఉండాలి. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత వేగంగా రుణగ్రహాత మరో రుణం తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
- నిలకడతో కూడిన రీపేమెంట్ చరిత్రను నిర్వహించడం: అన్ని రుణ చెల్లింపులను ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా సకాలంలో చెల్లించడం ద్వారా నిలకడతో కూడిన రీపేమెంట్ చరిత్రను నిర్వహించడం సాధ్యపడుతుంది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలను తగ్గించుకునేందుక గాను చెల్లింపుల కట్టుబాట్లను తీ ర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. జాప్యంతో కూడిన చెల్లింపులు మీ సిబిల్ నివేదికలో ఉం టాయి మరియు రుణగ్రహీత సిబిల్ స్కోర్ ను తగ్గించే అవకాశం ఉంది.
- లేట్ పెనాల్టీని తప్పించుకోండి: రుణగ్రహీత ఈఎంఐ బకాయి తేదీనాడు గనుక దాన్ని చెల్లించలేకపోతే, అది పేమెంట్ కమిట్ మెంట్ డిఫాల్ట్ కిందకు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పరిస్థితి మరింత అధ్వా న్నంగా తయారవుతుంది. ఎందుకంటే రుణగ్రహీత, ఈఎంఐ మొత్తానికి అదనంగా లేట్ ఫీజు / పెనాల్టీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. రుణగ్రహీత లేట్ పేమెంట్ రిమైండర్స్ నుంచి అసౌకర్యానికి గురి కాకుండా ఉం డాలంటే, తమ ఫోన్ క్యాలెండర్ లో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. లేదా తమ ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై స్టికీ నోట్స్ ఉంచుకోవచ్చు. అవి తదుపరి చెల్లింపు షెడ్యూల్ గురించి వారికి గుర్తు చేస్తాయి.
- సకాలంలో చెల్లింపుల ద్వారా తనపై రుణదాత నమ్మకాన్ని మెరుగుపర్చుకోవడం: రుణగ్రహీతలు సకా లంలో చెల్లింపుల ద్వారా తమపై రుణదాతల నమ్మకాన్ని పెంచుకోవడం ముఖ్యం. చెల్లింపుల కోసం వి విధ రకాల డిజిటల్ మోడ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా, సకాలంలో రు ణం తిరిగి చెల్లించడం అనేది రుణగ్రహీతలపై రుణదాతల నమ్మకాన్ని పెంచుతుంది. వారి మధ్య బంధాన్ని విశ్వసనీయమైందిగా చేస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి:
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది భారతీయ మార్కెట్లో అత్యంత వైవిధ్యభరి ఎన్బీఎఫ్ సిలలో ఒకటైన బజాజ్ ఫిన్ స ర్వ్ లెండింగ్ విభాగం. దేశవ్యాప్తంగా 50 మిలియన్ల కస్టమర్ల అవసరాలను తీరుస్తోంది. పుణె ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఈ సంస్థ వివిధ రకాల ఉత్పాదనలను అందిస్తోంది. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, లైఫ్ స్టైల్ ఫైనాన్స్, డిజిటల్ ప్రోడక్ట్ ఫైనాన్స్, వ్యక్తిగత రుణాలు, ఆస్తులపై రుణాలు, చిన్న వ్యాపార రుణాలు, వాలెట్, కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు, టూ- వీలర్, త్రీ- వీలర్ రుణాలు, వాణిజ్య రుణాలు / ఎస్ఎంఇ రుణాలు, సెక్యూరిటీపై రుణాలు, గ్రామీణ ఫైనాన్స్ వీటిలో ఉన్నాయి. బంగారంపై రుణాలు, వాహన రీఫైనాన్సింగ్ రుణా లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు సైతం వీటిలో ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలకు AAA/ Stable, స్వల్పకాలిక రుణాలకు A1+, ఎఫ్ డి ప్రోగ్రామ్ కు FAAA/Stable రేటింగ్ ను కలిగిఉండడాన్ని బజాన్ ఫైనాన్స్ లిమిటెడ్ తనకు గర్వ కా రణంగా భావిస్తోంది. ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ నుంచి ఈసీబీకి సంబంధించి లాంగ్ టర్మ్ ఇష్యూయర్ క్రెడిట్ రేటింగ్ BB+/Stable ను, షార్ట్ టర్మ్ రేటింగ్ B ని కలిగిఉంది. మరిన్ని వివరాలకు www. bajajfinserv.in ను సందర్శించగలరు.