Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణ భారదేశపు అతిపెద్ద, అత్యంత అనుభవం కలిగిన భూ సేకర్త, ప్లాట్ ప్రమోటర్ అయిన జి స్క్వేర్ హౌసింగ్, బళ్ళారిలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు అభివృద్ధిచేసిన ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తున్నట్టు ఈరోజు ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకదాంట్లో వున్న ఈ ప్రాజెక్ట్ జి స్క్వేర్ సిటీ, బళ్ళారిలో బియుడిఎ & ఆర్ఇఆర్ఎ అనుమతి పొందిన తొలి ప్రాజెక్ట్. 100 ఎకరాల భూమిలో విస్తరించివున్న, ఇళ్ళస్థలాలుగా అభివృద్ధిచేసిన ఈ ప్రాపర్టీలో 821 ప్లాట్లు వుంటాయి, ప్రారంభ ధర 34 లక్షల రూపాయలు. భారతదేశపు మొట్టమొదటి వాటర్ థీమ్డ్ ప్లాట్ టౌన్షిప్ అయిన దీంట్లో, 1 లక్షల చదరపు అడుగుల విలాసవంతమైన క్లబ్‌హౌస్, హెలీ పాడ్ వంటి ప్రత్యేక అంశాలతోపాటు 200లకు పైగా సౌకర్యాలున్నాయి. ప్రారంభోత్సవ ధర చదరపు అడుగుకి రూ. 3,100 అయినప్పటికీ, ఎర్లీబర్డ్ ఆఫర్‌గా మొదటి 25 బుకింగ్స్ కి మాత్రం చదరపు అడుగుకి రూ. 2,850 లకే అందిస్తోంది. చెన్నై, కొయంబత్తూర్, త్రిచ్చి, హోసూర్ల్లో రియల్ ఎస్టేట్ రంగంలో వేళ్ళూనుకుని స్థిరపడిన జి స్క్వేర్ మొట్టమొదటిసారిగా భరణీయమైన ఇళ్ళ స్థలాలని అందించడం ద్వారా కర్ణాటకలో అడుగుపెడుతోంది. రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకదాంట్లో వున్న బళ్ళారిలో, జి స్క్వేర్ సిటీ అనే ఈ ప్రాజెక్ట్, జిల్లాలో తొలిసారిగా రేరా అనుమతి పొందిన ప్రాజెక్ట్. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకి రోడ్డు ద్వారా బళ్ళారి ఎంతో చక్కగా అనుసంధానమై వుంది. జాతీయ రహదారి 13 (ఎన్‌హెచ్-13), జాతీయ రహదారి (ఎన్‌హెచ్-63), రాష్ట్ర రహదారి 19 (ఎఎస్హెచ్-19), రాష్ట్ర రహదారి 132 (ఎఎస్హెచ్-132) ద్వారా బళ్ళారి భారతదేశమంతటికీ అనుసంధానమై వుంటుంది. శ్రీ. ఈశ్వర్ ఎన్, సిఇఒ, జి స్క్వేర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "జి స్క్వేర్ వారి వాటర్ థీమ్డ్ టౌన్షిప్ అనేది, బళ్ళారిలో వివేకవంతులైన ఇళ్ళ కొనుగోలు దారులకి ఆలోచనాపూర్వకంగా, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన, 200+ సౌకర్యాలతో ప్రీమియం ఇళ్ళ స్థలాలు అందించాలన్న పెద్ద దృక్పథంలో భాగంగా వచ్చింది. జి స్క్వేర్ సిటీ అనేది బళ్ళారిలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది ఈ ప్రాంతంలో వున్న మిలినియల్ ఇళ్ళ కొనుగోలుదారుల డిమాండ్‌ని పునర్నిర్వచిస్తుంది. ఈ ప్రాజెక్టులో 1 లక్ష చదరపు అడుగుల క్లబ్‌హౌస్ వుంది, అది బళ్ళారిలోకెల్లా అతిపెద్దది, పైగా ఇందుకు అదనపు ఖర్చు ఏమీ లేదుకూడా. వేగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని చవిచూస్తున్న బెలగాల్ రోడ్డులో వున్న ఇది, బెంగళూరు ప్రగతి కారిడార్ కి దగ్గరకూడా అవడం వల్ల ఖచ్చితమైన స్థలంలోవున్నట్టవుతుంది" అన్నారు.