Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంతర్జాతీయ డిజిటల్ సేవలు మరియు కన్సల్టింగ్ కంపెనీ ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఓటీఎస్ఐ) , రాష్ట్ర ప్రజలకు సౌకర్యవంతమైన రీతిలో సేవలనందించడంలో భాగంగా ఆధార్, వాహన డాటా బేస్, ఫైనాన్షియర్లు, భీమా కంపెనీలతో పోర్టల్‌ను అనుసంధానం చేసి పూర్తి డిజిటలీకరణ పరిష్కారాలను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖను సమూలంగా మార్చింది. ఈ శాఖ కార్యకలాపాలలో పూర్తి పారదర్శకతను ఇది తీసుకురావడంతో పాటుగా ఆర్టీఓ కార్యాలయాలలో 80%కు పైగా క్యూలను తగ్గిస్తుంది. డిజిటలీకరణ దిశగా వేసిన ఈ చిన్న అడుగు కారణంగా రవాణాశాఖకు సంబంధించి 76 సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది. ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహన అనుమతులు, వాహపాల ఫిట్నెస్, వాణిజ్య పన్నుల చెల్లింపు, పౌర సేవలు, వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, భీమా వంటి సేవలను డిజిటలీకరించారు. ఓటీఎస్ఐ అత్యంత సహజమైన, అతి సులభంగా గుర్తించతగిన వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్‌ను పూర్తిగా ఆధార్ కార్డ్ ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కోసం అభివృద్ధి చేసింది. దీనిద్వారా వాహనానికి శాశ్వత నెంబర్‌ను అందించేందుకు పట్టే 90 రోజుల సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించింది. అంతేకాదు, ఆధార్కార్డ్పై సూచించిన చిరునామాకు ఈ పర్మినెంట్ నెంబర్‌ను డెలివరీ చేయనున్నారు. వాహన కొనుగోలు సమయంలోనే వాహనం మరియు యజమాని చిత్రం తీసుకోవడం వల్ల ఒకవేళ వాహనం దొంగిలించబడితే రికవరీ టూల్‌గా ఇది ఉపయోగపడుతుంది. ‘‘రాష్ట్ర రవాణా శాఖలను డిజిటలీకరించడమనేది చివరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను తోడ్పడుతుందనే నమ్మకంతో ఉన్నాము. పారదర్శకతను పెంచడానికి, సామర్థ్యం సృష్టించడానికి మరియు వాడుకలో సౌలభ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. కాలంతో పాటుగా సరళీకృత స్వీకరణ అవసరం ఉంది మరియు మనమంతా మహోన్నత అవకాశాలను చేజిక్కుంచుకోవడానికి వాటాదారులందరి నుంచి పూర్తి సహకారాన్ని చూడాలి. విస్తృత శ్రేణిలో చూసినప్పుడు, అన్ని రికార్డులనూ డిజటలీకరిస్తే అది ఎంతగానో సహాయపడుతుంది. ఇది వినియోగదారులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటుగా డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేషన్కూ తోడ్పడుతుంది ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే తరహా ప్రాజెక్ట్‌లు అందించగలమని ఆశిస్తున్నాము’’ అని ఓటీఎస్ఐ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నరసింహ గొండి అన్నారు.