Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్, కాయిన్‌స్విచ్ నేడు, క్రిప్టో రూపీ ఇండెక్స్ (CRE8)ను విడుదల చేసింది. ఇది క్రిప్టో మార్కెట్లో భారతీయ రూపాయి పనితీరుకు మొదటి ప్రామాణిక సూచిక. కాయిన్‌స్విచ్ యాజమాన్యపు నిర్వహణలో CRE8 ఎనిమిది క్రిప్టో ఆస్తుల పనితీరును ట్రాక్ చేస్తుంది. ఇవి భారతీయ రూపాయిలో ట్రేడ్ చేయబడిన క్రిప్టోల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 85% కన్నా ఎక్కువ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇండెక్స్ ప్రకారం కాయిన్‌స్విచ్ యాప్‌ను 18 మిలియన్లకు పైగా రిజిస్ట్రర్డు వినియోగదారులు విశ్వసిస్తున్నారు. భారతీయ క్రిప్టో మార్కెట్‌ను క్రిప్టో వినియోగదారులు అధ్యయనం చేసేందుకు coinswitch.co/crypto-indexలో CRE8 ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ ఎక్స్ఛేంజీల నుంచి క్రిప్టోలను కొనుగోలు చేసేందుకు సింగిల్ విండోగా కాయిన్స్విచ్ను 2017లో ఏర్పాటు చేశారు. జూన్ 2020లో క్రిప్టో ట్రేడింగ్‌ను భారతీయ రూపాయి (INR)కి విస్తరించారు. క్రిప్టో ఉద్యమంలో లక్షలాది మంది భారతీయులు భాగమయ్యేందుకు ఇది సులభమైన, సురక్షితమైన మరియు భద్రత కలిగిన ప్లాట్‌ఫారాన్ని అందిస్తోంది. ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (a16z), కాయిన్‌బేస్ వెంచర్స్, టైగర్ గ్లోబల్, సీక్వియా క్యాపిటల్, రిబ్బిట్ క్యాపిటల్ మరియు పారాడిగ్మ్తో సహా బ్లూ-చిప్ పెట్టుబడిదారుల మద్దతుతో, కంపెనీ విలువను $ 1.9 బిలియన్లుగా లెక్కించారు. ‘‘CRE8 అనేది భారతీయ మార్కెట్లో క్రిప్టో మార్కెట్, ఈక్విటీ వినియోగదారులకు సరళమైన, సులభంగా అర్థం చేసుకోగల ఇండెక్స్. వాస్తవంగా చేసే లావాదేవీల ఆధారంగా ఈ ఇండెక్స్ క్రిప్టో మార్కెట్లో భారతీయ రూపాయి విలువను విశ్వసనీయతతో, రియల్-టైమ్ వీక్షణను అందిస్తుంది. ఇది భారతీయ వినియోగదారులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సహిస్తుంది’’ అని కాయిన్‌స్విచ్ సహ-వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆశిష్ సింఘాల్ వివరించారు. కాయిన్‌స్విచ్ చేసే వాస్తవ లావాదేవీల ఆధారంగా క్రిప్టో మార్కెట్ రియల్-టైమ్ ఇన్సైట్లను ఈ ఇండెక్స్ అందిస్తుంది; రియల్ టైమ్‌లో మార్కెట్లో కదలికలకు అద్దం పడుతూ, రోజుకు 1,400 సార్లు ఇది రిఫ్రెష్ అవుతుంది; మరియు భారతీయ రూపాయి (INR) డినామినేట్ చేసిన (కరెన్సీ మార్పిడి రేట్లను పరిగణనలోకి తీసుకుంటుంది) ఏదైనా ఇతర అంతర్జాతీయ కరెన్సీ విలువకు కొలతగా ఉంటుంది. నెలవారీగా ఇండెక్స్ రీబ్యాలెన్స్ అవుతుంది మరియు అప్ టూ డేట్‌గా ఉండేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రీకాన్సిస్టిట్యూట్ అవుతుంది.