Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థపై ఎలన్ మస్క్ అనుమానం
- టెస్లాలో 10శాతం ఉద్యోగులకు కోత
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో ఎదో చెడు చోటు చేసుకుంటోందని అని పిస్తోందని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై గురువారం తన ఎగ్జిక్యూటివ్లకు ఈ మెయిల్ చేశారు. ఈ ఉద్దేశ్యంతోనే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించ నున్నట్టు ప్రకటించారు. కొత్త నియామ కాలను పూర్తిగా నిలిపివేస్తున్నామని తెలిపారు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని ఎలన్ మస్క్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలో ఏదో చెడు జరుగుతుందని తనకు అనిపి స్తుందని.. ఈ క్రమంలోనే ఉద్యోగులను తగ్గించుకుంటున్నామన్నారు. ఈ ప్రకటనతో టెస్లాలో పని చేసే ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2021 ముగింపు నాటికి ప్రపంచ వ్యాప్తంగా టెస్లా, దాని అనుబంధ సంస్థల్లో లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎలన్ మస్క్ ప్రకటనతో శుక్రవారం మార్కెట్లో ఆ కంపెనీ షేర్ 3 శాతం పడి పోయింది. మస్క్ వ్యాఖ్యలపై డచ్ బ్యాంక్ ఐఎన్జీ మైక్రో ఎకనామిక్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ కర్స్టెన్ జెస్కీ స్పందిస్తూ ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి గ్లోబల్ ఎకానమీ సర్దుకోనుందని అంచనా వేశారు. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలతో ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోన్న విషయం తెలిసిందే.