Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : BMW ఇండియా తన ప్రత్యేకమైన డ్రైవింగ్ ప్రోగ్రామ్ - BMW JOYFEST 2022 ను హైదరాబాద్‌లో 4 – 5 జూన్ 2022 న నిర్వహిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ ఈవెంట్‌ను చికానే సర్క్యూట్, షామిర్పేట్, బొమ్మరాస్పేట్ విలేజ్, లియోనియా రిసార్ట్స్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 500078 లో నిర్వహిస్తున్నారు. BMW’s ‘షీర్ డ్రైవింగ్ ప్లెజర్’ మరియు MINI’s ‘గో-కార్ట్ ఫీలింగ్’ ఫస్ట్- హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌ను వందలాది మంది వినియోగదారులు మరియు ఆశావహులు అందుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. రెండు-రోజులు కొనసాగే ఈవెంట్లో డ్రైవింగ్ డైనమిక్స్, మోడరన్ ఫంక్షనాలిటీ మరియు ఉన్నతమైన పనితీరు చూపించే BMW మరియు MINI ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలకు చెందిన ఆకర్షణీయమైన శ్రేణిని ప్రదర్శిస్తుంది. మల్టీ-సిటీ BMW జాయ్ఫెస్ట్ను భారతదేశంలోని 13 నగరాల్లో నిర్వహిస్తున్నారు. వినియోగదారులు మరియు ఆశావహులకు ఈ ప్లాట్‌ఫారమ్ BMW, MINI మరియు BMW మోటార్రాడ్ బ్రాండ్లను ఒకే చోట అందిస్తుంది. వారు నిపుణుల పర్యవేక్షణలో లేటెస్ట్ వాహనాలను పరీక్షించవచ్చు మరియు ఉత్పత్తి నిపుణులతో ఇంటకార్ట్ కావచ్చు. BMW సర్టిఫైడ్ శిక్షకులు డ్రైవింగ్ విధానాలు మరియు టెక్నిక్‌లు అయిన స్లాలోమ్, ఫాస్ట్ ల్యాప్స్, కార్నర్ బ్రేకింగ్ మరియు ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి వాటిపై విలువైన సలహాలను అందిస్తారు. టెస్ట్ డ్రైవ్‌ల కోసం సరికొత్త శ్రేణి BMW సెడాన్లు, స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్ (SAVs) మరియు MINI కార్లు అందుబాటులో ఉన్నాయి. BMW M340i xDrive మరియు BMW మోటార్రాడ్ మోటార్‌సైకిళ్లు ఈవెంట్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రత్యేకమైన జీవనశైలి జోన్లో మర్చెంటైజ్ మరియు యాక్ససరీల నుంచి అందుబాటులో ఉన్న మూడు అద్భుతమైన బ్రాండ్లను ప్రదర్శించారు. ప్రీమియం అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా, BMW జాయ్‌ఫెస్ట్ వినూత్నంగా లీనమయ్యే సెటప్‌తో అబ్జర్వేషన్ డెక్‌ను కలిగి ఉంది. ఒక ప్రత్యేక గేమింగ్ జోన్ కుటుంబం మొత్తానికి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారు విన్-విన్ బహుమతుల శ్రేణితో పాటు ఎయిర్ హాకీ, ఫూస్బాల్ మరియు ఉత్తేజకరమైన సిమ్యులేటర్-ఆధారిత రేసింగ్ గేమ్‌లను ఆడవచ్చు.