Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ (ఐజీఎక్స్) 14,90,450 ఎంఎంబీటీయు గ్యాస్‌ను (37.6 ఎంఎంఎస్‌సీఎం) వాణిజ్యం చేయడంతో పాటుగా మే 2022లో అత్యధికంగా 1241% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని నమోదు చేసింది. మే 2021లో 1,11,100 ఎంఎంబీటీయు వాణిజ్యం నమోదు చేసింది.
ఈ నెలలో, ఈ ఎక్సేంజ్ 8,46,300 ఎంఎంబీటీయు (21.3 ఎంఎంఎస్‌సీఎం) వాల్యూమ్స్‌ను డెలివరీ చేసింది.
ఈ ఎక్సేంజ్ వద్ద మే నెలలో కనుగొనబడిన సరాసరి ధర 1684 రూపాయలు/22 డాలర్లుగా ఒక్క ఎంఎంబీటీయుకు ఉంది. అదే సమయంలో సరాసరి అంతర్జాతీయ స్పాట్ గ్యాస్ ధర దాదాపుగా ఒక ఎంఎంబీటీయుకు 24 డాలర్లుగా ఉంది. ఈ ధర హెన్రీ హబ్ వద్ద దాదాపుగా 8.2 డాలర్లు/ఎంఎంబీటీయుగా నమోదయింది. ఎక్సేంజ్‌పై కనుగొనబడిన ధరలు భారతదేశపు డిమాండ్ మరియు సహజవాయువు సరఫరాను ప్రతిబింబిస్తుంది మరియు ఎల్ఎన్జీ దీర్ఘకాలిక, స్పాట్ మరియు దేశీయ గ్యాస్ ధరలను చక్కగా ఒడిసిపట్టింది.
కొత్త డెలివరీ పాయింట్ల సృష్టి మరియు దేశీయ గ్యాస్ ట్రేడింగ్ కోసం కాంట్రాక్ట్ పారామీటర్లలో మార్పులు కోసం పెట్రోలియం, సహజవాయు నియంత్రణ మండలి ఆమోదంకు లోబడి ఈ నెలలోనే ఐజీఎక్స్ డొమెస్టిక్ గ్యాస్ వాణిజ్యం కూడా ప్రారంభించింది. గ్యాస్ ఎక్సేంజ్ వద్ద కెజీ బేసిన్లో ఓఎన్జీసీ, ఆర్ఐఎల్/బీపీ ద్వారా ఉత్పత్తి చేయబడిన డొమెస్టిక్ గ్యాస్ సీలింగ్ ధరతో సహా ఫ్రీడమ్ డొమెస్టిక్ గ్యాస్‌ను ట్రేడింగ్ చేయవచ్చనే పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆగస్టు 2021లో జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఇది జరిగింది.
మే 2022 నెలలో గ్యాస్ మార్కెట్లో కనిపించిన ప్రధాన ఆకర్షణలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి
· మొత్తం వాణిజ్య పరిమాణం 14,90,450 ఎంఎంబీటీయు
· మొత్తం డెలివరీ చేసిన వాల్యూమ్ 8,46,300 ఎంఎంబీటీయు
· మొత్తం ట్రేడ్స్ సంఖ్య 114
· ప్రొప్రైయిటరీ సభ్యులుగా షెల్, హెచ్‌పీసీఎల్, ఓపల్ లు ఐజీఎక్స్పై చేరాయి
· డొమెస్టిక్ గ్యాస్ (సీలింగ్ ప్రైస్) ట్రేడింగ్‌లో ఐజీఎక్స్ ప్రవేశం
ఐజీఎక్స్ ఆరు (6) విభిన్నమైన కాంట్రాక్ట్‌లు అయినటువంటి డే –ఎహెడ్, డెయిలీ, వీక్ డే, వీక్లీ, పక్షం, నెల –లో డెలివరీ బేస్ ట్రేడ్ నిర్వహిస్తోంది. వరుసగా ఆరు(6) నెలలు దీనిని చేసింది. గ్యాస్ వాణిజ్యం పలు డెలివరీ పాయింట్స్ అయినటువంటి – దహేజ్, హజీరా, అంకోట్, మస్కల్, బాద్భుట్, దబోల్, కెజీ బేసిన్ ద్వారా ఐజీఎక్స్ వాణిజ్యం నిర్వహిస్తుస్తూ ఆరు (6) ప్రాంతీయ గ్యాస్ హబ్స్ అయినటువంటి వెస్ట్రన్ హబ్, సదరన్ హబ్, ఈస్ట్రన్ హబ్, సెంట్రల్ హబ్, నార్త్రన్ హబ్, ఈశాన్య హబ్‌ను కవర్ చేస్తుంది.