Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కంపెనీ బోర్డు ఇప్పుడు అర్హత కలిగిన సంస్ధాగత కొనుగోలు దారులు (క్యుఐబీలు)కు 12.50 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటుగా కేటాయించేందుకు అనుమతించింది. ఈ కంపెనీ ఇదే విషయాన్ని బౌర్సెస్కు తెలియజేసింది. ఈ అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యుఐపీ) ద్వారా వైవిధ్యీకరించబడిన లిస్టెడ్ సంస్ధ 50 కోట్ల రూపాయలను మదుపరుల నుంచి సమీకరించనుంది. వీరికి ఒక్కో షేర్‌కూ 3 రూపాయల ప్రీమియంతో పాటుగా నాలుగు రూపాయల చొప్పున షేర్‌ను కేటాయించనుంది. అయితే 4రూపాయల ఇష్యూ ధర ఫ్లోర్ ప్రైస్ అయిన 4.20 రూపాయలలో 0.10 లేదా 4.52 % రాయితీని సెబీ యొక్క రెగ్యులేటరీ ఫార్ములేషన్‌కు అనుగుణంగా కనుగొనడం జరుగుతుంది. అయితే, ఈ కంపెనీ బోర్డుకు నిర్ధిష్టమైన రాయితీని అందించేందుకు తగిన అధికారం ఉంది. ఇష్యూలో ఈక్విటీ షేర్ల కేటాయింపులకు అనుగుణంగా , కంపెనీ యొక్క పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 122.70 కోట్ల రూపాయలు (1, 22,70,70,991 రూపాయలు)గా నిలిచిందని కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మూడు అంతర్జాతీయ సంస్ధలు ఈ వాటాలు కొనుగోలుచేశాయి క్యుఐపీలో, కేవలం ముగ్గురు బిడ్డర్లు కేటాయించిన ఈక్విటీ షేర్ల మొత్తం అంటే 100%ను ఎఫ్‌పీఐ విభాగం కింద సొంతం చేసుకున్నారు. ఫోర్బెస్ ఈఎంఎఫ్కు 5. 4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 43.2 % ఈక్విటీషేర్లను కేటాయిస్తే ; నోమురా సింగపూర్ లిమిటెడ్‌కు 4.4 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 35.2% వాటాను కేటాయించారు. మిగిలిన 2.7 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 21.6 ను ఏజీ డైనమిక్ ఫండ్స్ లిమిటెడ్‌కు కేటాయించారు. ఆమోదించబడిన మరియు ఖరారు చేయబడిన కేటాయింపుల నోట్‌ను (క్యాన్)ను అర్హత కలిగిన సంస్ధాగత కొనుగోలుదారులకు పంపడం జరుగుతుంది. తద్వారా ఇష్యూకు అనుగుణంగా వారికి కేటాయించిన ఈక్విటీ షేర్ల గురించిన సమాచారం వెల్లడవుతుంది. అంతేకాదు, వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్, గతంలో వికాస్ మల్టీకార్ప్ లిమిటెడ్‌గా సుపరిచితం ఇప్పుడు క్యుఐపీ మార్గంలో 200కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఇది మొదటి ట్రాంచ్ మాత్రమే. ఈ కంపెనీ తదనంతర ట్రాంచ్‌లలో 150 కోట్ల రూపాయలను సమీకరించనుంది. వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్, పలు రసాయన కాంపౌండ్స్, పాలిమర్స్, పీవీసీ రెసిన్స్, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమ సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యంలో ఉంది. రియల్ ఎస్టేట్‌తో పాటుగా పాలిమర్స్, జీడిపప్పు వాణిజ్యం, తయారీ విభాగాలలో సైతం ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1995లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ఢిల్లీ కేంద్రీకృత కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది మరియు ఆటోమోటివ్, ప్యాకేజింగ్, షీతింగ్, టెక్స్టైల్ పరిశ్రమల కోసం రీసైకిల్డ్ మెటీరియల్ తయారుచేస్తుంది.